Viral News: అదృష్టమంటే వీళ్లదే, బైకును ఢీకొట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లినా ప్రాణాలతోనే
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో దారుణ ఘటన జరిగింది. బైకును ఢీకొట్టిన లారీ డ్రైవర్ అర కిలోమీటర్ వరకు అలాగే నడిపాడు. చివరికి బైకు మీద ఉన్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.
Lorry drags two on bike for 500 meter in Agra | ఆగ్రా: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఘటన గురించి తెలిస్తే షాకవుతారు. అదే సమయంలో అదృష్టమంటే వీళ్లదే అంటారు. ఓ బైకును లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీ కింద బైక్ చిక్కుకోగా డ్రైవర్ మాత్రం ఏ మాత్రం జాలి, దయ లేకుండా అలాగే వాహనం నడిపాడు. ఇద్దరు వ్యక్తులు లారీ కింద భాగంలో వేలాడుతూ హెల్ప్ హెల్ప్ అంటూ ప్రాణ భయంతో కేకలు పెట్టారు. ఇతర వాహనదారులు లారీ ఆపాలని చెబుతున్నా దాదాపు అర కిలోమీటర్ వరకు అలాగే ఈడ్చుకెళ్లాడు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.
కళ్ల ముందు చావు చూపించాడు
ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఓ బైక్‌ను రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక కంటైనర్ బైకును ఢీకొట్టి దాదాపు 500 మీటర్ల వరకు అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు. కానీ కొన్ని సెకన్లపాటు వారికి చావు కళ్ల ముందు కనిపించింది. మొదట లారీ ఓ బైకును ఢీకొట్టింది. అయితే ప్రమాదం జరిగిన తరువాత లారీ ఆపకుండా డ్రైవర్ అలాగే వెళ్లాడు. దాంతో లారీ కింద బైకు ఇరుక్కుపోయి దాని మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ప్రాణ భయంతో ఆర్తనాదాలు చేసినా డ్రైవర్ అవేమీ పట్టించుకోలేదు.
ఇది గమనించిన ఇతర వాహనదారులు లారీ డ్రైవర్ ను ఆపాలని చెప్పినా దాదాపు అర కిలోమీటర్ వరకు అలాగే బైకును ఈడ్చుకెళ్లాడు. చివరకు ఎలాగోలా రోడ్డు వేరే వాహనం అడ్డుపెట్టి లారీని ఆపేలా చేశారు. అనంతరం స్థానికులు ట్రక్కు డ్రైవర్‌ను చితకబాదారు. బైకు మీద వెళ్తున్న ఈ ఇద్దరు లారీ కింది భాగాన్ని గట్టిగా పట్టుకుని, రోడ్డుకు తగలకుండా జాగ్రత్తపడటంతో ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం లేదని, గాయాలు అయ్యాయని డాక్టర్లు తెలిపారు. బైక్‌పై వెళ్తున్న వారు ఆగ్రాకు చెందిన జాకీర్, రబ్బీ అని గుర్తించారు.
బైక్‌ను ఢీకొట్టి, అర కిలోమీటర్ లాక్కెళ్లిన లారీ
— Telugu Galaxy (@Telugu_Galaxy) December 25, 2024
ఉత్తరప్రదేశ్ - ఆగ్రాలో ఓ బైక్‌ను ఢీకొట్టి అర కిలోమీటర్ లాక్కెళ్లిన ట్రక్కు.. లారీ ముందు భాగంలో బైక్‌తో సహా ఇరుకున్న ఇద్దరు వ్యక్తులు
రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు, ట్రక్కును ఆపాలని ఎంత అరిచినా ట్రక్కు ఆపని డ్రైవర్.. చివరికి… pic.twitter.com/JvOMxnOyUp
లారీ డ్రైవర్ అరెస్ట్
డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని, అందువల్లే యాక్సిడెంట్ తరువాత సైతం వాహనం ఆపలేదని స్థానికులు తెలిపారు. ఆగ్రాలోని చట్టా పోలీస్‌స్టేషన్ లో దీనిపై కేసు నమోదైంది. ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంగా మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టినట్లు చట్టా సర్కిల్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. రామ్‌బాగ్ క్రాసింగ్ సమీపంలో యమునా నదిపై ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. కంటైనర్‌ను సీజ్ చేసి, డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. నిందితుడ్ని అరెస్ట్ చేశాం, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు. ట్రక్ డ్రైవర్‌ను ఫిరోజాబాద్‌కు చెందిన దీపక్‌గా గుర్తించారు.
Also Read: Viral News: పుష్ప 2 సినిమా చూసొచ్చి ఏకంగా బస్సు ఎత్తుకెళ్లాడు, ట్విస్ట్ ఏంటంటే!