News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Viral News: యూట్యూబ్ లో చూసి సొంత వైద్యం - 10 కర్పూరం బిళ్లలు మింగేసిన యువకుడు, చివరకు ఏమైందంటే?

Viral News: డయేరియాను తగ్గించుకోవడానికి ఓ వ్యక్తి యూట్యూబ్ లో చూసి వైద్యం చేసుకున్నాడు. పది కర్పూరం బిళ్లలు ఒకేసారి మింగేయగా.. ఆరోగ్యం విషమించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  

FOLLOW US: 
Share:

Viral News: ఈ మధ్య చాలా మంది యూట్యూబ్ లో వీడియోలు చూసి తమకు తామే వైద్యం చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ చాలానే కొనసాగుతోంది. అయితే తాజాగా ఓ వ్యక్తి కూడా యూట్యూబ్ ను నమ్ముకొని డయేరియా తగ్గించుకోవాలనుకున్నాడు. ఆస్పత్రికి వెళ్తే ఖర్చు ఎక్కువవుతుందని.. ఇక్కడైతే ఫ్రీగా తగ్గించుకోవచ్చని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వీడియోలు చూడడం మొదలు పెట్టాడు. చాలా మంది కర్పూరం బిళ్లలు మింగితే డయేరియా తగ్గుతుందని చెప్పగా.. నిజమనుకున్న సదరు యువకుడు ఒకేసారి 10 కర్పూరం బిళ్లలను మింగేశాడు. అయితే ఇలా చేయడం వల్ల ఉపశమనం పొందటానికి బదులుగా... అతడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. 

అసలేం జరిగిందంటే..?

ఝార్ఖండ్ రాష్ట్రంలోని లాతేహార్ జిల్లా బలుమత్ మండలంలోని టోటీ హెస్లా గ్రామంలో నివసిస్తున్న ఆవధేశ్ కుమార్ సాహుకు డయేరియా వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే చాలా ఖర్చు అవుతుందని భావించాడు. ఆక్రమంలోనే యూట్యూబ్ లో డయేరియా తగ్గించుకునేందుకు చిట్కాల కోసం వెతికాడు. కర్పూరం తింటే విరేచనాలు ఆగిపోతాయని ఓ వీడియో చూసి పది బిళ్లలు మింగేశాడు. ఆ తర్వాత అతడి ఆరోగ్యం పూర్తిగా పాడైంది. కుటుంబ సభ్యులు కూడా ఏం జరిగిందని ఆరా తీశారు. జరిగింది చెప్పిన వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. స్పందించిన వైద్యులు ప్రథమ చికిత్స చేశారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ఈ విషయమై డాక్టర్ అమర్ నాథ్ మాట్లాడారు. యువకుడికి విరేచనాలు అయ్యాయని చెప్పారు. అతడు యూట్యూబ్ లో చూసి సొంతంగా చికిత్స తీసుకున్నాడని 10 కర్పూరం బిళ్లలు మింగేశాడని వివరించారు. అయితే కర్పూరం ప్రభావం అతడి శరీరంపై చాలా ఎక్కువగా ఉందని అందుకే యువకుడు కనీసం రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని పేర్కొన్నారు. 

ఎట్టి పరిస్థితుల్లో సొంత వైద్యం వద్దు, అది చాలా ప్రమాదకరం!

యూట్యూబ్ లు, వీడియోల్లో చూసి సొంత వైద్యం చేసుకోవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మరింత పాడు చేసుకోవడమే అవుతుంది తప్పితే బాగు కాదని వివరిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఎలాంటి సొంత వైద్యం చేసుకోకూడదని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం బాగు అవడం కంటే కూడా నాశనం అవ్వడమే ఎక్కువని పేర్కొంటున్నారు. చాలా మంది డెలివరీలు కూడా యూట్యూబ్ చూసే చేసుకుంటున్నారని.. అది చాలా ప్రమాదకరం అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారంతా సొంత వైద్యానికి గుడ్ బై చెప్పి వైద్యులను సంప్రదించాలని వివరిస్తున్నారు. చిన్న చిన్న వాటికి వాము తినడమో, ఏదైనా ఆకు నమలడమో వంటి చిన్న చిట్కాలు ఓకే కానీ.. మరీ పెద్ద మొత్తంలో ప్రమాదకరం అనిపించే చిట్కాలను అస్సలే పాటించకూడదని హెచ్చరిస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి హానికర చిట్కాలను పాటించకండి. ఆరోగ్యానికి కాపాడుకోండి. 

Read Also: Land on Moon: అమ్మకు ప్రేమతో- తల్లి కోసం చంద్రుడిపై ఎకరా కొన్న కూతురు  

Published at : 27 Aug 2023 04:59 PM (IST) Tags: Viral News Jharkand News Man Swallowed 10 Camphor Pills Camphor Tablets Reduce Diarrhea

ఇవి కూడా చూడండి

Viral Video: న్యూయార్క్ వరదల్లో కుక్కతో వాకింగ్, ఓ వ్యక్తి నిర్వాకంపై నెటిజన్ల ఆగ్రహం

Viral Video: న్యూయార్క్ వరదల్లో కుక్కతో వాకింగ్, ఓ వ్యక్తి నిర్వాకంపై నెటిజన్ల ఆగ్రహం

ఢిల్లీ మెట్రో రైల్‌లో ముద్దులతో మైమరిచిపోయిన జంట, వైరల్ అవుతున్న వీడియో

ఢిల్లీ మెట్రో రైల్‌లో ముద్దులతో మైమరిచిపోయిన జంట, వైరల్ అవుతున్న వీడియో

Viral Video: ట్రెడ్‌మిల్‌ చేస్తూ కుప్ప కూలిన యువకుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో

Viral Video: ట్రెడ్‌మిల్‌ చేస్తూ కుప్ప కూలిన యువకుడు, గుండెపోటుతో మృతి - వైరల్ వీడియో

Viral News: టాబ్లెట్ అనుకుని ఎయిర్‌పాడ్‌ మింగేసిన మహిళ, కడుపులో వినిపించిన శబ్దాలు

Viral News: టాబ్లెట్ అనుకుని ఎయిర్‌పాడ్‌ మింగేసిన మహిళ, కడుపులో వినిపించిన శబ్దాలు

Spanish Man Arrest: లైవ్‌లో రిపోర్టర్‌కు లైంగిక వేధింపులు, వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

Spanish Man Arrest: లైవ్‌లో రిపోర్టర్‌కు లైంగిక వేధింపులు, వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు

టాప్ స్టోరీస్

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Lokesh : స్కిల్ కేసులో ముందస్తు బెయిల్ పొడిగింపు - లోకేష్‌కు మరోసారి ఊరట !

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌ని అరెస్ట్ చేసిన ఈడీ

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం