UP Auto Accident: బెలూన్ తగిలి ఆటో బోల్తా- ఇదేం హోలీరా నాయనా!
హోలీ రోజు ఉత్తర్‌ప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదం వీడియో వైరల్ అయింది.
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఒకరిపైఒకరు రంగులు జల్లుకుంటూ ప్రజలు హోలీ జరుపుకున్నారు. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో మాత్రం ఓ ఆకతాయి చేసిన పని వల్ల పలువురికి గాయాలయ్యాయి. రోడ్డుపై వేగంగా వెళ్తోన్న ఆటోపై ఓ కుర్రాడు వాటర్ బెలూన్ విసిరాడు. వెంటనే ఆ ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
#WATCH उत्तर प्रदेश: एक वायरल वीडियो में बागपत में तेज़ रफ़्तार से आ रहा ऑटो पानी से भरा गुब्बारा लगने से पलटता दिख रहा है। pic.twitter.com/GtGT5lQhxv
— ANI_HindiNews (@AHindinews) March 20, 2022
ఏం జరిగింది?
ఉత్తర్‌ప్రదేశ్ బాగ్‌పట్‌లో కొంతమంది కుర్రాళ్లు శనివారం హోలీ జరుపుకుంటున్నారు. అయితే రోడ్డుపై వేగంగా వెళ్లోన్న ఆటోపై ఓ కుర్రాడు వాటర్ బెలూన్ విసిరాడు. ఆ వాటర్ బెలూన్ ఆటో డ్రైవర్ తలకు బలంగా తగలడంతో వాహనం అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
బెలూన్ విసిరిన కుర్రాడు వెంటనే భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇలాంటి ఆకతాయిలతో జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
హోలీ సంబరాలు
దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రజలు రంగులు జల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉల్లాసంగా గడిపారు. రాజకీయ ప్రముఖులు కూడా ప్రజల మధ్యే వేడుకలు చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర సహా వివిధ ప్రాంతాల్లో హోలీ ఘనంగా జరిగింది. రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ దిల్లీలోని ఆయన నివాసంలో ప్రజలే మధ్యే హోలీ చేసుకున్నారు.
Also Read: Corona Cases India: దేశంలో కొత్తగా 1761 కరోనా కేసులు - అక్కడ కోవిడ్ మరణాలు 0
Also Read: Volodymyr Zelenskyy: అస్సాంలోని ఓ టీ పొడికి ఉక్రెయిన్ అధ్యక్షుడి పేరు, త్వరలో ఆన్‌లైన్లో అమ్మకానికి