Viral News : పిజ్జా ధరను రూ.10 వేలు- వైరల్ అవుతున్న రెస్టారెంట్ నిర్ణయం
Viral News : పిజ్జా ప్రియులకు షాకిచ్చే విషయం ఒకటి వైరల్ అవుతోంది. దాని ధర రూ.10వేలకు పైనే. అదే పైనాపిల్ పిజ్జా. ఇప్పుడు రెస్టారెంట్ నిర్ణయం వైరల్ అవుతోంది.

Pineapple Pizza : చాలా మందికి పిజ్జా అంటే ఇష్టం ఉంటుంది. ఈ చల్లని వాతావరణంలో వేడి వేడి పిజ్జా తింటుంటే ఆ మజాయే వేరని అంటుంటారు చాలా మంది. ఆనియన్, క్యాప్సికమ్, టోమాటో, చికెన్, పన్నీర్ లాంటి మొదలైన టాపింగ్స్ తో ఇప్పుడు మార్కెట్లోకి అనేక రకాల పిజ్జాలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే మీరెప్పుడైనా పైనాపిల్ పిజ్జా గురించి విన్నారా.. దీని గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ తరహా టాపింగ్ ను సాధారణంగా ఎవరూ ఇష్టపడరు కాబట్టి. కానీ ఓ రెస్టారెంట్ ఈ పైనాపిల్ పిజ్జాను అయిష్టంగానే తన మెనూలో చేర్చింది. కానీ ఓ కండిషన్ తో. అదేంటంటే..
యూకేలోని నార్విచ్ లో లూపా పిజ్జా అనే ప్రముఖ రెస్టారెంట్ పైనాపిల్ టాపింగ్ తో పిజ్జాను తయారి చేసి, అమ్ముతోంది. అయితే ఎవరైతే ఈ పైనాపిల్ పిజ్జాను కోరుకుంటారో వారు £100 చెల్లించాల్సి ఉంటుంది. అంటే భారతీయ కరెన్సీలో దాని ధర సుమారు రూ.10,500. ఈ రెస్టారెంట్ లో సాధారణంగా పిజ్జాల ధరలు £12 అంటే సుమారుగా రూ.1,270 గా ఉంటాయి. పైనాపిల్ పిజ్జా ప్రియులు దాన్ని రెస్టారెంట్ డెలివరూ మెనూలో చూడొచ్చు.
ఉద్దేశపూర్వకంగానే పిజ్జాపై అధిక ధర
పైనాపిల్ పిజ్జా ప్రియులను ఆర్డర్ చేయకుండా ఉంచేందుకు, నిరుత్సాహపరిచేందుకు ఈ రెస్టారెంట్ ఉద్దేశపూర్వకంగానే ఈ ధరలను పెంచినట్టు తెలుస్తోంది. యజమానులు, సిబ్బంది కూడా పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే వారు చాలా అయిష్టంగానే ఈ హవాయి పిజ్జాను తమ మెనూలో చేర్చారు. కానీ భారీ ధర ట్యాగ్‌తో.
ఈ విషయంపై మాట్లాడిన రెస్టారెంట్ సహ యజమాని ఫ్రాన్సిస్ వూల్ఫ్, "నేను పిజ్జాపై పైనాపిల్ టాపింగ్ ను పూర్తిగా అసహ్యించుకుంటాను" అని అన్నారు. ప్రధాన చెఫ్, క్విన్ జియానోరన్, "పైనాపిల్ కంటే స్ట్రాబెర్రీని ఉంచితే బెటర్ అనుకుంటున్నాను" అని చెప్పారు. ఇకపోతే సామ్ పనాపౌలోస్ హవాయి పిజ్జాను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. ఇది ఇటాలియన్ పాక ప్రోటోకాల్ యొక్క ఉల్లంఘనగా పరిగణించబడింది. ఓ నివేదిక ప్రకారం, గత సంవత్సరం కాలిఫోర్నియాలో 395.99 డాలర్లు అంటే దాదాపు రూ. 34,280తో రెడ్-హ్యూడ్ వేరియంట్ పిజ్జా మార్కెట్‌లోకి వచ్చింది. కాబట్టి ఈ పిజ్జా దానితో పోలిస్తే అంత ఖరీదైనదేమీ కాదు.
Also Read : Viral News : చాయ్‌లో బెల్లం లేదని యూట్యూబర్ కంప్లైంట్- జొమాటో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ చాట్ వైరల్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

