Viral News: రోజంతా కుక్కలతో గడుపుతున్న బాలుడు, మాటలు మరిచిపోయి కుక్కలా మొరుగుతున్నాడు
Thailand Boy Barks | ఎనిమిదేళ్ల బాలుడు క్రమంగా కుక్కలా మారిపోతున్నాడు. తల్లి, అన్నయ్య వదిలేయడంతో అలా కుక్కలతో ఆడుకుంటూ వాటిలాగే తయారవుతున్నాడు.

Thailand Boy neglected by his family | కుటుంబం నుండి ఆ బాలుడికి ఎలాంటి ప్రేమ దొరకలేదు. కుటుంబసభ్యుల నుంచి మద్దతు లభించకపోవడంతో తాను ఒంటరినని భావించాడు. ఇలాంటి కేసుల్లో ఎక్కువ మంది నేరాల వైపు వెళ్తుంటారు. నేరాలు చేయడం, డ్రగ్స్ లాంటి మత్తు పదార్ధాల కేసుల్లో చిక్కుకుని జీవితాలు నాశనం చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. కొందరు మాత్రమే తామేంటో నిరూపించుకుని మంచి వ్యక్తులుగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఘటన వివరాలు చూస్తే మీరు కూడా షాకవుతారు.
కుటుంబం నిర్లక్ష్యం చేయడంతో ఓ బాలుడు క్రమంగా జంతువుగా మారుతున్నాడు. మీరు విన్నది నిజమే. థాయిలాండ్‌లోని ఒక గ్రామంలో చాలా విచారకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 8 ఏళ్ల పిల్లవాడు ఇతర మనుషులలా కాకుండా కుక్కలా ప్రవర్తిస్తున్నాడు. చాలా గంటలపాటు కుక్కలతో ఆడుకోవడం, వాటితో కలిసి తిరగడంతో అతను ఇప్పుడు మొరుగుతున్నాడు. నాలుగు కాళ్లతో నడుస్తాడు. బాలుడి తల్లి, సోదరుడు అతన్ని పూర్తిగా ఒంటరిగా వదిలేయడంతో ఇది జరిగింది.
కుక్కలతో కలిసి నివసిస్తున్న బాలుడు
థాయిలాండ్‌లోని ఉత్తరాదిత్ అనే ప్రాంతంలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. ఒక స్కూల్ ప్రిన్సిపాల్ "ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ ఉమెన్" అనే సంస్థతో మాట్లాడుతూ, తన తల్లి, సోదరుడు చాలా కాలం నుంచి బాలుడ్ని పట్టించుకోలేదు. దాంతో ఆ బాలుడు ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి ప్రేమ, మద్దతు అతడికి లభించలేదు. అతడికి సరైన ఆహారం దొరకలేదు. ప్రభుత్వ ప్రయోజనం పొందడానికి అతని తల్లి ఒకసారి మాత్రం బాలుడ్ని స్కూలుకు తీసుకువచ్చింది. కొన్ని కారణాలతో అతడు స్కూలులో చేరలేకపోయాడు. తరువాత తల్లి బాలుడ్ని పట్టించుకోవడం మానేసింది. తల్లి, సోదరుడు బాలుడి ఆలనాపాలనా చూడటం మానేశారు. అతడి బాగోగులు పట్టించుకోవడం లేదు. దాంతో బాలుడు ఒంటరి అయ్యాడు. ఈ క్రమంలో అతను సమీపంలోని కుక్కలతో జీవించడం ప్రారంభించాడు.
కుటుంబం మాదకద్రవ్యాలకు బానిస
రోజూ కుక్కలతోనే పూర్తి సమయం గడపడంతో అతడు మాట్లాడటం మరిచిపోయాడు. కుక్కలా మొరగడం ప్రారంభించాడు. క్రమంగా అతను కుక్కల మాదిరిగా నడవడం, తినడం, వాటిలాగే ఆడుకోవడం చేస్తున్నాడు. అతడు మాట్లాడే పరిస్థితులో కూడా లేదు.46 ఏళ్ల బాలుడి తల్లి, 23 ఏళ్ల అన్నయ్య ఇద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలు అయ్యారు. పోలీసులు ఇద్దరినీ విచారించగా వారు డ్రగ్స్ కు బానిసైనట్లు తేలింది. వారి రక్తంలో నమూనాలతో నిర్ధారించారు.
వారిద్దరికి తమకు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో అని మాత్రమే ఆందోళన చెందేవారు. బాలుడ్ని పట్టించుకోవడం లేదని పోలీసులు తెలిపారు. దాంతో అతడు సమీపంలోని వీధి కుక్కలతోనే రోజంతా గడిపేవాడు. ఈ క్రమంలో అతడు కుక్కలాగ మొరగడం, నడవడం, తినడం చేస్తున్నాడు. వీధి కుక్కలే తన స్నేహితులు, కుటుంబంగా అతడు భావిస్తున్నాడు. అధికారులు బాలుడ్ని ఓ సెంటర్ కు తీసుకెళ్లాడు. ఇప్పుడు అతడ్ని మామూలు మనినిషిని చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. అతనికి మాటలు నేర్పిస్తారు. తరువాత స్కూలుకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. అలాంటి కుటుంబంలో ఉండటం కంటే అనాథ కావడం మంచిదని ఓ నెటిజన్ అన్నాడు. ఆ బాలుడికి అసలైన కుటుంబసభ్యులు దొరికారని మరొకరు అన్నారు.






















