Viral Video: సెల్ఫీలు దిగుదామని బ్రిడ్జి వద్ద ఆగమంది, బైక్ ఆపగానే భర్తను నదిలోకి తోసేసిన భార్య
Karnataka Viral News | సెల్ఫీ దిగుదామని నమ్మించించిన ఓ భార్య తన భర్తను కృష్ణా నదిలోకి తోసేసింది. ఈ ఘటన కర్ణాటక- తెలంగాణ సరిహద్దులోని రాయచూర్ జిల్లాలో జరిగింది.

Wife Tries to Kill Husband in Karnataka | రాయచూర్: ఈ మధ్య కాలంలో భర్తల హత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు హత్యలకు కారణంగా మారుతున్నాయి. గత కొన్ని రోజులుగా దేశంలో పలు రాష్ట్రాల్లో లవర్ కోసం భర్తలను చంపిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో ఇలాంటి కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా కర్ణాటకలో భర్తను హత్య చేసేందుకు భార్య చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అతడి అరుపులు విన్న కొందరు అక్కడికి వచ్చి ప్రాణాలు కాపాడారు.
అసలేం జరగిందంటే..
కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా శివపుర కు చెందిన తాతప్పకు ఇటీవల పెళ్లైంది. ఈ దంపతులు బైకు మీద రాయచూర్ వెళ్తుండగా... మధ్యలో గుర్జాపూర్ బ్రిడ్జి దగ్గర బైక్ ఆపమని భార్య చెప్పింది. కృష్ణా నది వద్ద బైకు ఆపాడు. ఈ క్రమంలో సెల్ఫీలు, ఫొటోలు దిగుదామని భార్య అడగటంతో భర్త ఆగాడు. సెల్ఫీ దిగుదామని ప్రయత్నింస్తుంటే భర్త ఒక్కసారిగా నదిలో పడిపోయాడు. నీళ్లలో కొద్దిదూరం కొట్టుకుపోయిన తాతప్ప బండరాయి రావడంతో గట్టిగా పట్టుకున్నాడు. తరువా రాయి మీదకు చేరిన ఆ వ్యక్తి తనను కాపాడాలని కేకలు వేశాడు. బ్రిడ్జి మీద ఉన్న భార్య మాత్రం భర్తను కాపాడాలని కేకలు వేయడానికి బదులుగా ఎవరికో ఫోన్లు చేస్తూ కనిపించింది.
అటుగా వెళ్తున్న స్థానికులు ఓ వ్యక్తి బ్రిడ్జి మీద నుంచి నదిలో పడినట్లు గుర్తించారు. కొన్ని తాళ్లు గట్టిగా కట్టి నీళ్లలోకి వేశారు. ఆ తాడు తనకు సమీపానికి రాగానే వ్యక్తి తాడును పట్టుకున్నాడు. బ్రిడ్జి మీద నుంచి వారు తాడును లాగగా ఆ వ్యక్తి పైకి వచ్చాడు. సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ భర్త నదిలో పడిపోయాడని భార్య చెప్పింది. అయితే బాధితుడు మాత్రం తాను నదిలో పడిపోలేదని, సెల్ఫీ దిగుదామని నమ్మించి భార్య తనను బ్రిడ్జి పైనుంచి నదిలో తోసేసిందని చెప్పడంతో అక్కడున్న వారు షాకయ్యారు.























