Viral Video: గుర్రమెక్కిన ఫుడ్ డెలివరీ బాయ్, ఎందుకో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది
ఆన్‌టైమ్‌లో ఫుడ్ డెలివరీ చేసేందుకు ముంబయిలోని ఓ డెలివరీ బాయ్ ఇలా గుర్రపు స్వారీ చేశాడు.
ఫుడ్ డెలివరీ చేసేందుకు గుర్రంపై..
ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక మనకు బద్ధకం పెరిగిపోయింది. అన్నీ ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చేసుకుని లాగించేస్తున్నాం. మన ఈ బద్ధకమే ఆ కంపెనీస్‌కు మంచి బిజినెస్ తెచ్చి పెడుతోంది. సిటీల్లో అయితే ఫుడ్ డెలివరీ బాయ్స్‌కి క్షణం తీరిక దొరకట్లేదంటే ఏ స్థాయిలో ఆర్డర్లు వస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ డిమాండ్‌కు తగ్గట్టుగానే కంపెనీలు వాళ్లకు ఆ బాయ్స్‌కి ఇన్‌సెంటివ్స్ ఇస్తూ ప్రోత్సహిస్తోంది. ఫలానా టైమ్‌లోగా వెళ్లి ఆర్డర్ అందిస్తే వాళ్లకి మంచి రేటింగ్ కూడా వస్తుంది. అందుకే ఇన్‌టైమ్‌లో ఆర్డర్ ఇచ్చేందుకు వాళ్లు పడరాని పాట్లు పడుతుంటారు. ఇప్పుడు ముంబయిలోనూ ఓ స్విగ్గీ డెలివరీ బాయ్ ఇలా చేసే వార్తల్లోకెక్కాడు. భారీ వర్షం పడుతున్నా, లెక్క చేయకుండా ఫుడ్‌ను డెలివరీ చేసేందుకు చాలా వేగంగా వెళ్లిపోయాడు. ఎలాగో తెలుసా..? గుర్రంపైన. అవును గుర్రపుస్వారీ చేస్తూ ఆ వర్షంలో తడుస్తూ కనిపించాడు
డెలివరీ బాయ్. ఇదంతా ఓ వ్యక్తి తన కార్‌లో నుంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇది నెట్టింట గుర్రం కన్నా వేగంగా చక్కర్లు కొడుతోంది.
ముంబయిలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ముంబయిలో భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. .ఇలాంటి కష్ట సమయంలోనూ గుర్రంపైన వెళ్లి ఫుడ్ డెలివరీ చేయాలన్న ఆలోచన రావటమే గ్రేట్ అంటున్నారు నెటిజన్లు. రకరకాల ఫన్నీ కామెంట్స్‌తో స్పందిస్తున్నారు. ముంబయిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని IMD ఇప్పటికే అంచనా వేసింది. ఆరెంజ్ అలర్ట్‌ను కూడా జారీ చేసింది. ఈ వర్షాల కారణంగా కల్బాదేవి, సియాన్ ప్రాంతాల్లో రెండు బిల్డింగ్‌లు కూలిపోయాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రభావిత ప్రాంతాల ప్రజల్ని సురక్షితంగా వేరే చోటకు తరలిస్తున్నారు.
Also Read: BJP National Executive Meeting: ప్రధాని మోదీ స్పీచ్‌లో ఇవే హైలైట్ కానున్నాయా, ఆయన ఏం మాట్లాడతారు?