Sudha Murty: వెజ్‌కి నాన్ వెజ్‌కి ఒకటే స్పూన్- వైరల్‌గా మారుతన్న సుధా మూర్తి కామెంట్స్
తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ‘ఖానే మే కౌన్ హై’ (యూట్యూబ్ సిరీస్)లో సుధామూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
సుధా మూర్తి పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ రచయిత్రిగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్యగా బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ అత్తగా సుపరిచితం. ఈమె తరచూ వార్తల్లో ఉంటారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ‘ఖానే మే కౌన్ హై’ (యూట్యూబ్ సిరీస్)లో సుధామూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.
#SudhaMurthy #simplicity pic.twitter.com/Pzt6dseRAz
— @Ram_Mohd_Singh_Azad (@Arun_Kaku05) July 25, 2023
తన పనుల విషయంలో సాహసాలు చేసేందుకు ఇష్టపడతానని చెప్పిన సుధామూర్తి వంటల్లో మాత్రం సాహసాలు చేయడానికి భయపడతానని చెప్పారు. తాను పూర్తిగా వెజిటేరియన్ అని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ గుడ్డు, వెల్లుల్లి కూడా తినడం లేదని సుధామూర్తి వెల్లడించించారు. విదేశాలకు వెళ్లినప్పుడు వెజిటేరియన్ రెస్టారెంట్ కోసం వెతుకుతానని, లేకపోతే సొంతంగానే ఆహారం వండుకుంటానని తెలిపారు. నీటిలో సులభంగా వేడి చేసి తయారు చేసుకునే పోహా లాంటి రెడీ టు ఈట్ వస్తువులను బ్యాగ్ నిండా తీసుకెళ్తానని చెప్పారు. వెజ్ కు, నాన్‌వెజ్ కు ఒకే చెంచా ఉపయోగించడం తనకు నచ్చదన్నారు. అందుకే తాను హోటళ్లను ఎంపిక చేసుకునేటపుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తానని వెల్లడించారు.
#SudhaMurthy https://t.co/2SLjHMOVXp pic.twitter.com/vkPy9t9Fl5
— Ratna Bajpai (@ratna_bajpai) July 26, 2023
ముందు జాగ్రత్తగా తన హ్యాండ్ బ్యాగ్ నిండుగా తినుబండారాలను తీసుకెళ్తానని చెప్పుకొచ్చారు. తన వద్ద ఓ కుకింగ్ బ్యాగ్ ఉందని అందులో చిన్న కుక్కర్ కూడా ఉందని, దానిని తన సొంతంగా ఆహారాన్ని వండుకోవడానికి ఉపయోగిస్తానని పంచుకున్నారు. ఒకప్పుడు ఎగతాళి చేసిన ఈ ఆచారం ఇప్పుడు అమ్మమ్మ నుంచి అలవాటుగా మారిందని నవ్వుతూ చెప్పారు. తన అమ్మమ్మ 60 ఏళ్ల క్రితం ప్రయాణానికి వెళ్లేటప్పుడు సొంతంగా ఆహారం తెచ్చుకునేవారని, అందుకు తాను ఆట పట్టించేదానని అన్నారు. ఎందుకు బయట తినకూడని అమ్మమ్మను ప్రశ్నించేదానినని అప్పుడు ఆమె అది తనకు అలవాటని చెప్పిందన్నారు. ఇప్పుడు తాను తన అమ్మమ్మలా ప్రవర్తిస్తున్నానని, ఏ దేశం వెళ్లిన తన ఆహారాన్ని వెంట తీసుకెళ్తానన్నారు.
We should not judge people based on their food preferences or other personal habits. Instead, we should focus on treating everyone with respect, regardless of their caste. #SudhaMurthy
— le changement est certain (@svmurthy) July 26, 2023
దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు భారతీయ మహిళ అంటూ మద్దతు తెలుపుతున్నారు. మరికొందరు చాదస్తమంటూ వ్యతిరేకిస్తున్నారు. మరి కొందరు ఏకంగా ఆమె కుటుంబాన్ని ఉద్దేశిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె అల్లుడు, బ్రిటన్ ప్రధాన మంత్రి రుషి సునాక్ మాంసాహారి అనే విషయాన్ని గుర్తు చేస్తూ, ఆయనను ఆయన పిల్లలను ముట్టుకోవద్దని సలహా ఇస్తున్నారు.
Many Indians pack food while travelling abroad. Food is a choice. #sudhamurthy is any elderly woman in our household who likes to chat.
— Dharanya (@Dharanyamsu) July 26, 2023
స్పై థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ‘రాజీ’ అనే సినిమాలో అలియా దేశం కోసం పనిచేసే గూఢచారి పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలను చూసి సుధామూర్తి కన్నీళ్లు పెట్టారట. సాధారణంగా ఇలాంటి ఎమోషనల్ సన్నివేశాలను చూసినా తానెప్పుడు కన్నీళ్లు పెట్టలేదని, కానీ ఆ సినిమాలో అలియా నటనకి మాత్రం కన్నీళ్లు వచ్చేశాయని సుధామూర్తి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.