Viral News: సెల్ ఫోన్ చూస్తూ ఆర్టీసీ బస్సు డ్రైవింగ్ - భయాందోళనకు గురైన ప్రయాణికులు, ఆలస్యంగా వెలుగులోకి!
Andhra News: ప్రకాశం జిల్లా పొదిలి ఆర్టీసీ డ్రైవర్ తీరు విమర్శలకు దారితీసింది. భారీ వర్షంలో సెల్ ఫోన్ చూస్తూ బస్సు డ్రైవింగ్ చేయడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.
RTC Bus Driver Driving While Using Mobile Phone In Podili: 'సెల్ ఫోన్ చూస్తూ వాహనం నడపరాదు.' అని ట్రాఫిక్ సిబ్బంది, పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొంతమంది తీరు మారడం లేదు. ఏకంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ సైతం నిబంధనలు మీరడం విమర్శలకు తావిస్తోంది. భారీ వర్షంలో రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా తదేకంగా సెల్ ఫోన్ చూస్తూ ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రకాశం జిల్లాలో ఆగస్ట్ 31న జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా (Prakasam District) పొదిలి డిపో ఆర్టీసీ డ్రైవర్ ఎండి మస్తాన్ సెల్ ఫోన్ చూస్తూ బస్సు ర్యాష్ డ్రైవింగ్ చేశాడు.
భారీ వర్షం పడుతున్నా రోడ్డు సరిగ్గా కనిపించకపోయినా అలానే సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేశాడని ప్రయాణికులు ఆరోపించారు. ఫోన్ చూస్తూ బస్సు నడపొద్దని కోరినా డ్రైవర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. దీంతో అతని చేష్టలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, దీనిపై ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఈ తరహా డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతున్న దృష్ట్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: Cyber Crime: సైబర్ నేరాలకు సాఫ్ట్ వేర్ అస్త్రంతో చెక్ - మళ్లీ నేరాలకు పాల్పడకుండా పటిష్ట చర్యలు