Railway Tracks System Works: రైల్వే ట్రాక్‌లు వాటంతట అవే ఎలా మారతాయి? ట్రాక్‌లు మార్చే ఈ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
Railway Tracks System Works: రైల్వే ట్రాక్ లు వాటంతటవే ఎలా మారతాయి? రైల్వే ట్రాక్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది.. దానిని ఎవరు ఆపరేట్ చేస్తారు?
Railway Tracks System Works: రైళ్లు ట్రాక్ లు మారుతుంటాయి. ఒక ట్రాక్ నుంచి మరో ట్రాక్ పైకి వస్తుంటాయి. మేజర్ స్టేషన్ లు వచ్చే ముందు ట్రాక్ లు మారి వాటికి కేటాయించిన ప్లాట్‌ఫామ్ లపైకి వస్తాయి. అలాగే కూడళ్ల వద్ద కూడా రైళ్లు ట్రాక్ లు మారి తమ గమ్యస్థానానికి వెళ్తుంటాయి. రైళ్లు ట్రాక్ లు ఎలా మారుతుంటాయి.. ఈ రైల్వే ట్రాక్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది.. ఈ వ్యవస్థ ఎలా పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ట్రాక్ సిస్టమ్ ఎలా పని చేస్తుంది?
రైళ్లు స్ట్రెయిట్ ట్రాక్ పై ఎక్కువగా ప్రయాణిస్తుంటాయి. అయితే రైలు ఓ నిర్దిష్ట మార్గంలో వెళ్లవలసి వచ్చినప్పుడు లేదా మలుపు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ ట్రాక్ సిస్టమ్ పని చేస్తుంది. ఇక్కడ ట్రాక్ లు లాకింగ్ సిస్టమ్ పై పని చేస్తాయి. ఈ ట్రాక్ లాకింగ్ సిస్టమ్ ద్వారా మాత్రమే రైళ్లు దిశను మార్చుకుంటాయి. ట్రాక్ వద్ద మరో దారిలోకి వెళ్తుండే మరో ట్రాక్ పైకి రైలు వెళ్లేలా ఈ ట్రాక్ సిస్టమ్ పని చేస్తుంది. అవసరం లేని సమయంలో రైలు దాని మార్గంలోనే వెళ్లేలా ట్రాక్ సిస్టమ్ తన దిశను మారుస్తుంది.
ట్రాక్ మార్చే పాయింట్ వద్ద స్లాంటింగ్ ట్రాక్, టంగ్ రైల్ రెండూ ఉంటాయి. స్లాంటింగ్ అనేది కదలని ట్రాక్. టంగ్ రైల్ అనేది సిగ్నల్ ఆధారంగా కదులుతుంది. ఈ టంగ్ రైల్ కదలిక వల్లే రైలు తన ట్రాక్ ను మార్చుకుంటుంది. రైలు ట్రాక్ మార్చుకోవడం అనేది పూర్తిగా రైల్వే ట్రాక్ సిస్టమ్ చూసుకుంటుంది. రైలు లోకో పైలట్ హస్తం ఉండదు. లేదా కారు లాగా స్టీరింగ్ తిప్పడం లాంటిది కూడా ఉండదు.
రైలు ట్రాక్ ఎవరు మారుస్తారు?
అంతకు ముందు రైలు ట్రాక్ మార్చడానికి ప్రత్యేకమైన వ్యక్తులు ఉండే వారు. వారిని ట్రాక్ మ్యాన్లుగా పిలిచే వారు. వీళ్లు మాన్యువల్ గా టంగ్ రైల్ ను మార్చేవారు. అయితే ఇప్పుడు మొత్తం ఆటోమేటిక్ అయింది కాబట్టి కంట్రోల్ రూమ్ నుంచే రైలు ట్రాక్ లు మార్చడం ఆటోమేటిక్ గా జరిగిపోతోంది.
ఎన్‌ఎమ్‌జీ కోచ్‌లకు కిటికీలు, తలుపులు ఉండవు
సాధారణంగా రైళ్లకు కిటికీలు, తలుపులు ఉంటాయి. గూడ్స్, కార్గో రైళ్లకు కిటికీలు, తలుపులు ఉండవు కానీ, అన్ని రకాల రైళ్లకు ఉంటాయి. అయితే ఈ కిటికీలు, తలుపులు లేని రైళ్లను ఎన్‌ఎమ్‌జీ కోచ్ లు అంటారు. అసలు ఈ ఎన్‌ఎమ్‌జీ కోచ్ లు అంటే ఏంటి? ఈ ఎన్‌ఎమ్‌జీ కోచ్ లను ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా? మనం కూర్చుని ప్రయాణించే రైలు కోచ్‌లు కూడా రిటైర్ అవుతాయి. భారతీయ రైల్వేలో ప్రయాణీకులకు సేవలందిస్తున్న ICF కోచ్ 25 సంవత్సరాలుగా ఉపయోగించబడుతుంది. ఈ సమయంలో, ప్రతి 5 లేదా 10 సంవత్సరాలకు ఒకసారి మరమ్మతులు చేస్తుంటారు. 25 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, ప్యాసింజర్ రైలు నుండి ICF కోచ్ లను తొలగిస్తారు. ఆ తర్వాత, ఈ రిటైర్డ్ కోచ్‌ను NMG (న్యూలీ మాడిఫైడ్ గూడ్స్) రేక్ పేరుతో ఆటో క్యారియర్ గా ఉపయోగిస్తారు. కోచ్ ను NMG గా మార్చినప్పుడు, దాని కిటికీలు, తలుపులు అన్నింటిని మూసేస్తారు. కార్లు, ట్రాక్టర్లు, మినీ ట్రక్కులు వంటి వాహనాలను సులువుగా ఎక్కించుకునేలా, అన్ లోడ్ చేసుకునే విధంగా ఈ వ్యాగన్ లను సిద్ధం చేస్తారు.