By: ABP Desam | Updated at : 25 Jul 2023 10:36 AM (IST)
Edited By: jyothi
తప్పించుకోవడానికి లంచం డబ్బు నమిలి మింగేశాడు - అధికారులు తిరిగి కక్కించారు!
Viral Video: మధ్య ప్రదేశ్‌లోని కట్నీలో రెవెన్యూ విభాగానికి చెందిన వీఆర్ఓ 5 వేల రూపాయల లంచం తీసుకున్నాడు. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన జబల్‌పూర్ లోకాయుక్త స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఎస్‌పీఈ) బృందం... అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీఆర్ఓ గజేంద్ర సింగ్ ఓ భూమి కేసులో ఫిర్యాదుదారుడు చందన్ సింగ్ లోధిని లంచం ఇవ్వమని అడిగాడు. ఐదు వేలు ఇస్తే తప్ప పని చేయనని చెప్పాడు. దీంతో ఫిర్యాదుదారుడు జబల్ పూర్‌లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారుల బృందం బిల్హారీకి చేరుకుంది.
రూ.4,500 లను నమిలి మింగేసిన అధికారి
ఈక్రమంలోనే ఫిర్యాదుదారుడు చందన్ సింగ్ లోధి.. వీఆర్ఓ ప్రైవేటు కార్యాలయంలో రూ.4,500 రూపాయలు లంచంగా ఇస్తుండగా... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈక్రమంలోనే వీఆర్ఓ ఆ డబ్బును నోట్లో కుక్కుకిని నమిలి మింగేశాడు. విషయం గుర్తించిన అధికారులు వెంటనే అతడికి జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స సమయంలో వీఆర్ఓ నోటి నుంచి లంచం నోట్లు గుజ్జు రూపంలో బయట పడ్డాయి.
"సింగ్ లంచం కోరుతున్నట్లు బర్ఖెడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాకు ఫిర్యాదు చేశాడు. దీంతో మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలనుకున్నాం. కానీ పిర్యాదుదారుడి నుంచి డబ్బు తీసుకున్న వెంటనే వీఆర్ఓ ఎస్పీఆ బృందాన్ని గుర్తించి డబ్బును మింగేశాడు. దీంతో వెంటనే అతన్ని మేము ఆసుపత్రికి తరలించాం. ప్రస్తుతం అతడి ఆరోగ్యం బాగానే ఉంది." అని ఎస్పీఈ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంజయ్ సాహు తెలిపారు. అతనిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
Heart of Milky Way: జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫోటో చూసి సైంటిస్టులు షాక్
Viral Video: కార్‌పై క్రాకర్స్ కాల్చిన ఆకతాయిలు,రోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ నానా రచ్చ - వీడియో వైరల్
Thailand offers a crazy offer to Indians : థాయ్ మసాజ్ కావాలా? ఇండియన్స్‌కి క్రేజీ ఆఫర్ ఇచ్చిన థాయ్‌లాండ్
యాక్సిడెంట్ అయిన కార్‌లో మందు బాటిల్స్, ఎగబడి ఎత్తుకెళ్లిన స్థానికులు - వైరల్ వీడియో
ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!
Lets Vote : ఓటేద్దాం రండి - ఓటు మన హక్కే కాదు బాధ్యత కూడా !
Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
/body>