Interesting Facts: ప్లాస్టిక్ కుర్చీకి మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది - ఈ సైంటిఫిక్ రీజన్ మీకు తెలుసా ?
సాధారణంగా ప్లాస్టిక్ స్టూల్స్‌ని కానీ, ప్లాస్టిక్ చైర్స్ ఒకదానిపై ఒకటి వేసి పక్కన పెడుతూ ఉంటాము. స్టూల్స్ మధ్యలో రంధ్రాలు లేకపోతే ఆ రెండు కుర్చీలు ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోతాయి.
మన చుట్టూ ఉండే వస్తువులలో చాలా వాటి గురించి మనకు తెలుసని అనుకుంటాం. కానీ, మనకి తెలియని విషయాలు ఎవరన్న చెప్పినప్పుడు లేక బయటపడినప్పుడు మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంటాం. నిశితంగా గమనించడం మొదలుపెడితే మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు అలాంటి వస్తువుకు సంబంధించిన షాకింగ్ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మీరు ప్లాస్టిక్ టేబుల్‌పై కనిపించే రంధ్రాన్ని చాలాసార్లు గమనించే ఉంటారు. అయితే ఈ రంధ్రం ఎందుకు ఉంటుందో మీకు తెలుసా.? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారా. ప్లాస్టిక్ కుర్చీలపై ఉండే రంధ్రాలు ఉండేందుకు ఓ సైంటిఫిక్ కారణం ఉంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో రంధ్రం ఎందుకు ఉంటుంది ?
ప్లాస్టిక్ స్టూల్ మధ్యలో ఓ రంధ్రాన్ని పెట్టడానికి ఓ బలమైన కారణం ఉందనే చెప్పాలి. సాధారణంగా ప్లాస్టిక్ స్టూల్స్‌ని కానీ, ప్లాస్టిక్ చైర్స్ ఒకదానిపై ఒకటి వేసి పక్కన పెడుతూ ఉంటాము. ఇలాంటప్పుడు స్టూల్స్ మధ్యలో రంధ్రాలు లేకపోతే ఆ రెండు కుర్చీల మధ్యలో ఏర్పడే ఖాళీ వల్ల కుర్చీలు ఒకదానిలో ఒకటి ఇరుక్కుపోతాయి. అంతేకాదు.. ఒత్తిడి, వాక్యూమ్‌ను పాస్ చేయడానికి స్టూల్‌కు రంధ్రాలు చేస్తారు. వాస్తవానికి ప్లాస్టిక్ స్టూల్స్ తక్కువ స్థలంలో సరిపోతుండటం కారణంగా ఇళ్లలో ఉపయోగిస్తుంటారు. నిజానికి స్టూల్స్ ఎక్కువ స్థలాన్ని తీసుకోవు. ఒకదానిపై ఒకటి పెట్టేందుకు కూడా అనువుగా ఉంటాయి. విశాల ప్రాంతంలో ఉన్నప్పటికీ, అవి తక్కువ స్థలానికే పరిమితం అయి ఉంటాయి.
భద్రత కూడా ఓ కారణమే:
సైన్స్ పరంగా చూస్తే భద్రత కోసం టేబుళ్లకు రంధ్రాలు వేస్తారు. బరువైన వ్యక్తి టేబుల్ మీద కూర్చున్నప్పుడు, రంధ్రాలు అతని శరీర బరువును సమానంగా వర్తింపజేస్తాయి. దీని కారణంగా ఆ టేబుల్ విరిగిపోదు. దానిపై కూర్చున్న వ్యక్తి కూడా సురక్షితంగా ఉంటాడు. అంతేకాదు.. ఒత్తిళ్లు, శూన్యతలే కాకుండా కుర్చీలో రంధ్రాలు రావడానికి చాలా కారణాలున్నాయి. సరిగ్గా గమనించినట్టైతే ఈ స్టూల్స్ మధ్యలో ఉండే రంధ్రాలన్ని గుండ్రంగానే ఉంటాయి. మరే ఇతర షేపులో ఉండవు. ఈ గుండ్రటి షేప్ మూలంగా చెయిర్ పై అధిక బరువు ప్రెజర్ పడినప్పుడు విరిగిపోకుండా ఉండడంలో ఉపయోగపడుతుంది. ఒక్క కుర్చీ విషయంలో మాత్రమే కాదు.. నిత్యం మనం ఉపయోగించే చాలా వస్తువుల తయారీలో కూడా ఎంతో కొంత సైన్స్ దాగుంటుంది. అయితే చాలా వరకు ఆ సైన్స్ గురించి మనకు తెలియకుండానే వాటిని ఉపయోగిస్తుంటాం. వాటి ఉపయోగం తెలిసిన తర్వాత అవాక్కవుతాం. ఇలాంటి ఆసక్తికరమైన అంశాల్లో ప్లాస్టిక్ కుర్చీలు ఒకటనే చెప్పాలి. అయితే ఇలా ప్రతి ఒక్క కుర్చీకి రంధ్రం ఉంటుందా..? అంటే మాత్రం అసలు ఉండదనే చెప్పాలి.
కేవలం గుండ్రంగా ఉండి, చెక్క టెబుల్ లాంటి కుర్చీలల్లో మాత్రమే ఈ రకమైన రంధ్రం ఉంటుంది. అయితే సాధారణ కుర్చీల్లో అయితే.. ఓ వ్యక్తి కుర్చీపై కూర్చుంటే అతడి శరీర బరువు మొత్తం కుర్చీతో పాటు వాటి హ్యాండ్స్ పై కూడా పడుతుంది. కానీ ఈ రౌండ్ టెబుల్ ఆకారంలో ఉండే కుర్చీపై కూర్చుంటే ఆ వ్యక్తి యొక్క బలం మొత్తం ఆ కుర్చీపైనే పడుతుంది.