స్కిప్పింగ్ ఆడుతూ తాడు మెడకు చుట్టుకుని-స్టంట్ అనుకరించి మృతి చెందిన బాలుడు!
దిల్లీలో ఓ పదేళ్ల బాలుడు స్కిప్పింగ్ చేస్తూ తాడు మెడకు చుట్టుకుని మృతి చెందాడు. స్టంట్‌లు అనుకరించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
స్కిప్పింగ్ ఆడుతూ తాడు మెడకు చుట్టుకుని-స్టంట్ అనుకరించి మృతి చెందిన బాలుడు!
స్కిప్పింగ్ తాడు మెడకు చుట్టుకుని బాలుడి మృతి
స్కిప్పింగ్ చేస్తూ ఓ పదేళ్ల బాలుడు చనిపోయిన ఘటన దిల్లీలో జరిగింది. ఉస్మాన్‌పూర్‌కి సమీపంలో ఉన్న కర్తర్ నగర్‌లో ఓ బాలుడు స్కిప్పింగ్ ఆడుతుండగా ప్రమాదావశాత్తు తాడు మెడకు చుట్టుకుని ఊపిరాడక చనిపోయాడని పోలీసులు వెల్లడించారు. ఓ టీవీషోలో స్టంట్‌ను చూసిఇమిటేట్ చేయబోతుండగా ఇలా జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి అసహజ మృతిగానే పరిగణిస్తున్న పోలీసులు ఇంకా కేసు నమోదు చేయలేదు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బాలుడి తల్లిదండ్రులు అక్కడ లేరని తెలిపారు. తల్లి సెకండ్ ఫ్లోర్‌లో పని చేస్తుండగా, తండ్రి ఆఫీస్ పనిలో ఉన్నారని చెప్పారు. పిల్లాడు పడిపోయి ఉండటాన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్పిటల్‌కి తీసుకొచ్చే లోపే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
ఈ ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతానికి ప్రమాదావశాత్తు మరణించాడని ప్రాథమికంగా నిర్ధరించామని, ఇప్పటి వరకూ కేసునమోదు చేయలేదని స్పష్టం చేశారు. ఈ బాలుడు తరచు స్టంట్ వీడియోలు చూసేవాడని, వాటిని అనుకరిస్తూ అవే స్టంట్‌లు ఇంట్లో చేసేవాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. రోప్‌తో చేసే స్టంట్‌ను అప్పుడే చూశాడని, అది అనుకరించే క్రమంలోనే ఇలా జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అనుకోకుండా అది మెడకు చుట్టుకుని ఉందని, విడిపించుకోలేక ఊపిరాగిపోయి మృతి చెందాడని ప్రాథమికంగా నిర్ధరించారు. ఇప్పుడే కాదు. ఇలా టీవీల్లో, సినిమాల్లో స్టంట్స్‌ని చూసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు గతంలోనూ జరిగాయి. కొన్ని కార్టూన్ ఛానల్స్‌లో వచ్చే సీరియల్స్‌ని చూసి అదే విధంగా అనుకరిస్తుంటారు పిల్లలు. అందుకే వారిని ఓ కంట కనిపెడుతూ ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనే ఆలోచన ఆ వయసులో ఉండదు కాబట్టి, తల్లిదండ్రులే వారిని జాగ్రత్తగా కాపాడుకోవాలని చెబుతున్నారు.
Enacting a #socialmedia video stunt proved costly to a ten-year-old boy who died of suffocation after his skipping rope got entangled around his neck in East #Delhi's New Usmanpur.
— IANS (@ians_india) June 23, 2022
A police source said that the other part of the rope got stuck into the peg of a standing cot. pic.twitter.com/sSM5fPgOv7