Viral Video: పెన్సిల్, పిజ్జా, షార్ప్‌నర్, పిజ్జా కార్లు చూశారా? - హైదరాబాదీ టాలెంట్‌కు ఆనంద్ మహీంద్రా ఫిదా, వైరల్ వీడియో
Hyderabad News: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హైదరాబాదీ టాలెంట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. వెరైటీ కార్లను తయారు చేసే మ్యూజియంకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తానంటూ చెప్పారు.

Anand Mahindra Shares Hyderabad Talent Video: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటుంటారు. ప్రపంచం నలుమూలల్లో జరిగే వింతలు, వినూత్న ఆవిష్కరణలను షేర్ చేస్తుంటారు. ఆయన తాజాగా ఓ హైదరాబాదీ టాలెంట్‌ను పరిచయం చేస్తూ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. పెన్సిల్, షూ, షార్పనర్, పిజ్జా.. ఇలా రకరకాల కార్లను తయారు చేస్తున్న వ్యక్తి గురించి వివరించారు. హైదరాబాద్‌కు చెందిన సుధాకర్ అనే వ్యక్తి కొన్నేళ్లుగా వెరైటీ కార్లను తయారు చేస్తున్నారు. పెన్సిల్, షూ, షార్ప్‌నర్, పిజ్జా.. ఇలా వినూత్న ఆకారాల్లో కార్లను తయారు చేస్తూ ఓ మ్యూజియం సైతం ఏర్పాటు చేశారు. ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సైతం దక్కించుకున్నారు.
వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
If there weren’t any people who doggedly pursued their passions—no matter how quirky—this world would be far less interesting..
— anand mahindra (@anandmahindra) October 26, 2024
I’m embarrassed to say I hadn’t heard about the Sudha Car Museum in Hyderabad—even though I travel there often—until I recently saw this clip.… pic.twitter.com/c4LASs1JRV
తాజాగా ఈయన టాలెంట్‌ను ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. మ్యూజియంకు సంబంధించిన వివరాలతో కూడిన వీడియోను పంచుకున్నారు. 'ఎంత చమత్కారమైనా తమ అభిరుచులను పట్టుదలతో కొనసాగించే వ్యక్తులు లేకపోతే ఈ ప్రపంచం ఆసక్తిగా ఉండదు. ఈ వీడియోలో కనిపించే వాహనం చాలా చమత్కారంగా ఉంది. ఇలాంటి కార్ల పట్ల ఏదైనా అభిరుచికి మేము మద్దతిస్తాం. నేను ఈసారి ఎప్పుడైనా హైదరాబాద్ పర్యటనకు వస్తే ఇక్కడికి వెళ్లడానికి ప్లాన్ చేస్తాను.' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వెరైటీ కార్లు బాగున్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

