Alluri News: ప్రమాదకర వాగును తాడు సాయంతో దాటారు - సచివాలయ సిబ్బంది సాహసం, ఎందుకో తెలుసా?
Andhrapradesh News: అల్లూరి జిల్లాలోని మారుమూల గ్రామాలకు పెన్షన్ అందించేందుకు సచివాలయ ఉద్యోగులు పెద్ద సాహసమే చేశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగును తాడు సాయంతో దాటి లబ్ధిదారులకు పెన్షన్ అందించారు.
Ward Secratariat Staff Crossed Water Fall In Alluri District: ఆ పేదల కళ్లల్లో ప్రభుత్వం అందించే పెన్షన్ అందుకున్నామన్న ఆనందం చూసేందుకు ఆ సచివాలయ ఉద్యోగులు పెద్ద సాహసమే చేశారు. భారీ వర్షాలతో ప్రమాదకరంగా మారిన వాగును తాడు సాయంతో దాటి ఏజెన్సీ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు పింఛన్ డబ్బులు అందించి వృత్తి పట్ల తమకున్న నిబద్ధతను చాటుకున్నారు. అల్లూరి జిల్లాలోని (Alluri District) సచివాలయ ఉద్యోగులు చేసిన సాహసంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదబయలు (Pedabayalu) మండల పరిధిలోని పలు గ్రామాల్లో పింఛన్ అందించేందుకు సచివాలయ సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న వాగును తాడు సాయంతో దాటి ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ లబ్ధిదారులకు పింఛన్లు అందించారు. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. సకాలంలో తమకు పెన్షన్ డబ్బులు అందించి సాయం చేసిన సిబ్బందికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. వృత్తి పట్ల వారు చూపిన నిబద్ధతకు గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని ప్రతీ లబ్ధిదారునికి ఒకటో తేదీనే పింఛన్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ అందిస్తోంది. ఈ నెల తొలి రోజునే రాష్ట్రవ్యాప్తంగా 97 శాతం మంది లబ్ధిదారులకు సిబ్బంది పింఛన్ అందించారు.
Also Read: Viral Video: అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రతం - ఇంగ్లీష్‌లో సత్యదేవుని వ్రత కథ, వైరల్ వీడియో