YS Sharmila: సీఎం కేసీఆర్ ఓ హంతకుడు..! వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు, కవిత టార్గెట్‌గా ట్వీట్
బిడ్డ కవిత ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లిందని.. ఉరి వేసుకొనుడే ఉద్యోగంగా రోజుకొక్క నిరుద్యోగి చస్తుంటే మాత్రం దొరకు కనపడుత లేదా అని తెలంగాణ సీఎంను వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
కూతురు కవిత ఒక్కసారి ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లింది.. మరి నిరుద్యోగుల ఆత్మహత్యలు కనిపిస్తలేవా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. కూతురు కల్వకుంట్ల కవితకు మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు.
‘బిడ్డ కవిత ఒక్కసారి ఎన్నికల్లో ఓడిపోతేనే కేసీఆర్ గుండె తల్లడిల్లింది. బిడ్డకు రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి, ఇప్పుడు మంత్రి పదవి కట్టబెట్టేందుకు కూడా రెడీగా ఉన్నారు. నోటిఫికేషన్స్ లేక, ఉద్యోగాలు రాక.. పురుగులమందు తాగుడు, ఉరి వేసుకొనుడే ఉద్యోగంగా రోజుకొక్క నిరుద్యోగి చస్తుంటే మాత్రం దొరకు కనిపించట్లేదు’ అంటూ సీఎం కేసీఆర్‌ను ట్విట్టర్‌లో వైఎస్ షర్మిల విమర్శించారు.
Also Read: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా నోటిఫికేషన్స్ ఇవ్వాలనే సోయి లేదు దొరకు.
— YS Sharmila (@realyssharmila) November 27, 2021
నిరుద్యోగులను బలితీసుకొంటున్న హంతకుడు కేసీఆర్.
ఇంకెంత మందిని బలితీసుకొంటే ఉద్యోగాలు ఇస్తారు సారూ? నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా? వాళ్ళ ప్రాణాలు నీకు లెక్కలేదా? 2/2
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు ప్రాణాలు తీసుకుంటున్నారని.. కానీ వాటిని పట్టించుకోకుండా కేవలం తన కుటుంబసభ్యులకు మాత్రం పదవులు కట్టబెడుతున్నారంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బిడ్డలే బిడ్డలా.. మిగతా వాళ్ల బిడ్డలు బిడ్డలు కాదా.. వారి ప్రాణాలంటే మీకు లెక్కలేదా అని ప్రశ్నించారు. ‘కేవలం ఈ ఒక్క నెలలోనే ఆరుగురు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా నోటిఫికేషన్స్ ఇవ్వాలనే సోయి దొరకు లేదు. నిరుద్యోగులను బలితీసుకొంటున్న హంతకుడు కేసీఆర్. ఇంకెంత మందిని బలితీసుకొంటే ఉద్యోగాలు ఇస్తారు సారూ? నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా? వాళ్ళ ప్రాణాలు నీకు లెక్కలేదా?’ అని ట్వీట్ ద్వారా సీఎం కేసీఆర్‌ను నిలదీశారు.
Also Read: Shilpa Chowdary: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రిటర్నింగ్ అధికారి, నిజాబామాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి నుండి ధృవీకరణ పత్రం అందుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మరోసారి ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ కవిత ధన్యవాదాలు తెలిపారు. అన్ని పార్టీల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు గమనించి పోటీ లేకుండా టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించారని సంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !