By: ABP Desam | Updated at : 03 Jun 2023 06:03 PM (IST)
సంపద వెదకడం అమ్ముకోవడమే కేసీఆర్ పని - షర్మిల ఘాటు విమర్శలు ( Image Source : @realyssharmila )
Sharmila On KCR : పదేండ్లలో సీఎం కేసీఆర్ సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లేనని వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ ప్రసంగమంతా అబద్ధాలమయం, అరచేతిలో వైకుంఠమని విమర్శించారు. రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోతుందో లేదో తెలియదు కానీ కేసీఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటుందని చెప్పారు. రెండు సార్లు ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదన్నారు. సోషల్ మీడియాలో సుదర్ఘమైన పోస్ట్ పెట్టారు.
కేసీఆర్ దొర ప్రసంగమంతా అబద్ధాలమయం.. అరచేతిలో వైకుంఠం. పదేండ్లలో కేసీఆర్ గారు సాధించింది అప్పులు, ఆత్మహత్యలు, కమీషన్లు. రాష్ట్రాన్ని చూసి దేశం నివ్వెరపోతుందో లేదో కానీ కేసీఆర్ కమీషన్లు, కబ్జాలు, దందాలు చూసి దేశమే నవ్వుకుంటుంది. సకల జనుల పోరాటాన్ని తెలంగాణ రూపంలో దొర చేతిలో…
— YS Sharmila (@realyssharmila) June 3, 2023
రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3.17 లక్షలకు పెరిగితే .. ఒక్కొక్కరి మీద రూ.1.50లక్షల అప్పు ఎందుకు ఉన్నట్లని షర్మిల ప్రశ్నించారు. 2014లో రూ.16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రం.. 2023 నాటికి 5 లక్షల కోట్ల అప్పులకు ఎందుకు చేరుకున్నట్లని నిలదీశారు. జలయజ్ఞం ప్రాజెక్టులను సొంత ప్రాజెక్టులుగా చెప్పుకోడానికి కేసీఆర్ కు సిగ్గుండాన్నారు. డిజైన్ మార్చి లక్ష కోట్లకు పెంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని కాళేశ్వరం కట్టి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దని విమర్శించారు. 10 ఏళ్లుగా కేసీఆర్ చేసింది లేదన్న షర్మిల... ఎన్నికల్లో ఓట్ల కోసం పోడు పట్టాలంటూ డ్రామాలాడుతున్నాడని ఆరోపించారు. గృహలక్ష్మి, లక్ష రుణం, గొర్రెలు, బర్రెలు, పనిముట్లు అంటూ కొత్త నాటకాలకు కేసీఆర్ తెరలేపాడని షర్మిల చెప్పారు. సంపద పెంచడం, ప్రజలకు పంచడం కాదు.. సంపద వెతకడం అమ్మడమే కేసీఆర్ సిద్దాంతమని వెల్లడించారు.
రెప్ప పాటు కరెంట్ కోతలు లేవని చెప్పి.. డిస్కంలను రూ. 26వేల కోట్ల అప్పుల్లోకి ఎందుకు నెట్టినట్లు..? 24 గంటల ఉచిత విద్యుత్ అని చెప్పి.. 9గంటలు కూడా ఇవ్వకపోవడం విద్యుత్ విజయమా! ఉమ్మడి రాష్ట్రంలోనే 18 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బీజం పడితే.. కొత్తగా మీరు సాధించింది ఏంటి? భూపాలపల్లి ప్లాంట్ వైయస్ఆర్ ప్రారంభించినదే కదా..? జైపూర్, భద్రాద్రి ప్లాంట్లకు బీజం వేసింది కూడా మహానేతనే కదా? అని ప్రశ్నించారు. ఐదేండ్లలోనే మహానేత వైయస్ఆర్ 40 లక్షల పక్కా ఇండ్లు కట్టిస్తే.. తొమ్మిదేండ్లలో లక్ష ఇండ్లు కట్టలేని నువ్వు.. ఇండ్లు లేని 36లక్షల మంది ఆత్మగౌరవాన్ని కాపాడినట్లా..! 1.30 లక్షల మందికే ఈ దఫా దళితబంధు ఇస్తే.. మిగతా 18 లక్షల కుటుంబాల ఆత్మగౌరవం ఎక్కడ పోయినట్లు..? జలయజ్ఞం ప్రాజెక్టులను సొంత ప్రాజెక్టులుగా చెప్పుకోడానికి కేసీఆర్ కి సిగ్గుండాలి. ఆనాడే 30 లక్షల ఎకరాలకు తడిపిన ఘనత వైయస్ఆర్ ది అయితే.. డిజైన్ మార్చి లక్ష కోట్లకు పెంచి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేని కాళేశ్వరం కట్టి మోసం చేసిన చరిత్ర కేసీఆర్ దన్నారు.
10 ఏళ్లుగా చేసింది లేదు కానీ ఎన్నికల్లో ఓట్ల కోసం పోడు పట్టాలు, గృహలక్ష్మి, లక్ష రుణం, గొర్రెలు, బర్రెలు, పనిముట్లు అంటూ కొత్త నాటకాలకు తెరలేపాడు దొర. సంపద పెంచడం - ప్రజలకు పంచడం కాదు.. సంపద వెతకడం - అమ్మడం, దొర ఖజానాకు చేర్చడం, దోచుకున్న డబ్బుతో దేశ రాజకీయాలు చేయడం.. ఇదే నవ తెలంగాణ, ఇదే తెలంగాణ మోడల్. ఉద్యమ తెలంగాణ-ఉజ్వల తెలంగాణ కాలేదు.. ఉద్యమ తెలంగాణ మళ్ళీ ఉద్యమాల తెలంగాణగానే మారిందిన్నారు.
TSLPRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, తుది ఫలితాలపై అభ్యంతరాలకు అవకాశం- అభ్యర్థులకు కీలక సూచనలు
Tribal Unversity: ములుగు గిరిజన యూనివర్సిటీలో వచ్చే ఏడాది నుంచే ప్రవేశాలు!
Krishna Water: కృష్ణా జలాల పంపకాలపై కేంద్ర కీలక నిర్ణయం
Nandhikanti Sridhar Joins BRS: కాంగ్రెస్ కు బిగ్ షాక్ - కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్
Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!
Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు
/body>