By: ABP Desam | Updated at : 20 Feb 2023 05:35 PM (IST)
కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక వస్తుందా ? ఈసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
TS ByElection : తెలంగాణలో ఉపఎన్నికల రాజకీయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పని గట్టుకుని ఉపఎన్నికలు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందడంతో ఎవరూ కోరుకోకపోయినా అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. అయితే ఉపఎన్నిక జరుగుతుందా లేదా అన్నది మాత్రం.. ఎన్నికల కమిషన్ చేతుల్లోనే ఉంది.
ఏదైనా స్థానం ఖాళీ అయితే ఆరు నెలల్లో ఎన్నిక నిర్వహించారు.
ఒక ఎమ్మెల్యే రాజీ నామా చేసినా, చనిపోయిన సమయానికి సాధారణ ఎన్నికలకు 6 నెలల కంటే ఎక్కువ సమయం ఉంటే ప్రజాప్ర తినిథ్య చట్టం ప్రకారం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీని ప్రకారం కంటో న్మెంట్ ఉప ఎన్నిక ఈ ఏడాది ఆగస్టు లోపు జరగాల్సి ఉంటుంది. ఒక వేళ మేలో కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక జరిగితే ఆ తర్వాత గెలిచిన అభ్యర్థి పదవీ కాలం కేవలం నవంబరు దాకే ఉంటుండడంతో ఈ లోపు ఎన్నికల కమిషన్ ఉప ఎన్నికను నిర్వహిస్తుందా లేదా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. ఎమ్మెల్యే పదవీ కాలం ఏడాది లోపు ఉంటే.. ఎన్నికలు నిర్వహించాలా వద్దా
అన్నది ఈసీ నిర్ణయం ప్రకారం ఉంటుందని చెబుతున్నారు. శాసన సభ గడువు వచ్చే డిసెంబర్ 11వ తేదీతో ముగియనుంది. అంటే మరో 10 నెలలో మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నికలు జరిగే అవకాశం లేదని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు.
ఈసీ అనుకుంటే ఎన్నికలు పెట్టొచ్చు !
ఎన్నికల సంఘం పెట్టాలనుకుంటే మాత్రం ఉపఎన్నిక నిర్వహించడానికి ఆటంకాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. కర్ణాటక అసెంబ్లి ఎన్నికలు మేలో జరగనుండడంతో వాటితో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే అవకాశాలు లేకపోలేదని రాజ కీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాదే రాష్ట్ర అసెంబ్లికి సాధారణ ఎన్నికలుం డడంతో ఈ ఎన్నికలకు కాస్త ముందుగా కంటోన్మెంట్ ఉప ఎన్నిక గనుక జరిగితే రాష్ట్రంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరడం ఖాయమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికనే అసెంబ్లి ఎన్నికతో ముడిపెట్టి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాయి. ఇక సాధారణ ఎన్నికలకు కాస్త వ్యవధిలోనే కంటోన్మెంట్ ఉప ఎన్నిక గనుక జరి గితే ఇక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీకే అసెంబ్లి ఎన్నికల్లో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని భావించే వాతావరణం నెలకొంటుంది.
ఉపఎన్నిక వస్తే రాజకీయంగా మరోసారి ఎన్నికల వేడి !
తెలంగాణలో ఇప్పుడు ఉపఎన్నికలు అంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉపఎన్నికల ఫలతాలు సాధారణ ఎన్నికల్లో ప్రజల మూడ్‌ను కూడా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదని పలువురు విశ్లేషిస్తు న్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇటు బీఆర్‌ఎస్ అటు బీజేపీకి గట్టి పట్టుండడంతో ఈ ఉప ఎన్నిక కూడా రెండు పార్టీల మధ్య హోరాహోరీగా మారే అవకాశాలుంటాయని ఆయా పార్టీలకు చెందిన నాయకులు భావిస్తున్నారు. అయితే రాజీనామా చేసిన స్థానం కాకపోవడం.. సాయన్న ఆరు సార్లు పోటీ చేసి కేవలం ఒక్క అతి స్వల్ప తేడాతో ఓడిపోయిన నేత కావడంతో.. ప్రజాభిమానం ఎక్కువగా ఉండటంతో అక్కడ ఎన్నికలు పెట్టి.. . రాజకీయ మలుపులు తిప్పాలన్న భావన కరెక్ట్ కాదన్న అభిప్రాయం బీజేపీలో కూడా వినిపిస్తోంది.
Super Speciaity Hospital: దేశంలో తొలిసారిగా 24 అంతస్తుల ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మన దగ్గరే!
Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Nizamabad కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు - టీపీసీసీ చీఫ్ రేవంత్ ఏం చేయనున్నారో!
Hyderabad Fire Accidents: అగ్నిప్రమాదాల నివారణకు GHMC కొత్త వ్యూహం - ఇకపై ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!
Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!
Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్లో సరికొత్త రికార్డ్!