అన్వేషించండి

Industrial Area Fire Accidents: పారిశ్రామిక వాడల్లో పేలుళ్లు ఎందుకు జరుగుతాయి? కారణాలు ఇవే

రియాక్టర్లలో అధిక ఉష్ణోగ్రత, పీడనం పెరిగిపోయి నియంత్రణ కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి. ఉష్ణాన్ని విడుదల చేసే (exothermic) ప్రతిచర్య సరిగా చల్లబడకపోతే, అవి పేలుడుకు దారితీస్తాయి.

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో  భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమ(Sigachi Industries)లో రియాక్టర్ పేలడంతో 12 మంది కార్మికులు చనిపోయారు. 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. తరచూ పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోవడం, వాటి వల్ల కార్మికులు చనిపోవడం లేదా తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. అయితే, ఈ పరిశ్రమల్లో ఎందుకు పేలుళ్లు జరుగుతాయన్న అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

రసాయన చర్యల కారణంగా పేలుళ్లు

పరిశ్రమల్లో ఉత్పత్తి జరగాలంటే రసాయన పదార్థాలు వాడటం తప్పనిసరి. అందులో కొన్నిసార్లు ప్రమాదకరమైన రసాయనాలు కూడా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో, రసాయన ప్రతిచర్యలు కొన్నిసార్లు నియంత్రణ కోల్పోవడం జరుగుతుంది. అంటే, రియాక్టర్లలో అధిక ఉష్ణోగ్రత, పీడనం పెరిగిపోయి నియంత్రణ కోల్పోయే పరిస్థితులు తలెత్తుతాయి. ఉష్ణాన్ని విడుదల చేసే (exothermic) ప్రతిచర్య సరిగా చల్లబడకపోతే, అవి పేలుడుకు దారితీస్తాయి.

రసాయన మిశ్రమాల వల్ల పేలుళ్లు

కొన్ని సందర్భాల్లో, పరిశ్రమల్లో ప్రమాదకర రసాయన పదార్థాలను వాడాల్సి వస్తుంది. వీటిని కార్మికులు తెలిసీ తెలియక కలిపినా, లేక పొరపాటున రెండు ప్రమాదకర రసాయన పదార్థాలు కలిసినా అవి తీవ్రమైన, వేగంతో ప్రతిచర్యకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ ప్రతిచర్యలు పేలుళ్లకు కారణం కావచ్చు. నిపుణులు చెప్పేది ఏంటంటే, కొన్ని రసాయనాలు సహజంగా అస్థిరంగా ఉంటాయి. ఉదాహరణకు, పెరాక్సైడ్‌లు వంటి రసాయన పదార్థాలు చిన్న మార్పులకు లోనైనా పేలుళ్లకు కారణం కావచ్చు.

వాయువుల ఒత్తిడి పెరగడం వల్ల పేలుళ్లు

పరిశ్రమల్లో వినియోగించే రసాయనాల వల్ల, కొన్నిసార్లు ఉత్పత్తికి అవసరమైన వాయువులు వాడే సందర్భంలో ఈ పేలుళ్లు జరగవచ్చు. రసాయన ప్రక్రియ సందర్భంలో పెద్ద ఎత్తున వాయువులు జనించే అవకాశం ఉంది. వాటిని సరైన రీతిలో ఒత్తిడి లేకుండా బయటకు పంపించాల్సి ఉంటుంది. అలా వాటిని సరిగా బయటకు పంపకపోతే, రియాక్టర్లలో తీవ్రమైన ఒత్తిడి పెరిగి భారీ పేలుళ్లు జరిగే అవకాశం ఉంది.

పైన చెప్పినవన్నీ రసాయన, వాయు పదార్థాల ప్రభావంతో జరిగే పేలుళ్లు. వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఈ ప్రమాదాలు జరగకుండా సంబంధిత యాజమాన్యం పర్యవేక్షణ జరపాల్సి ఉంటుంది. ఉద్యోగులకు, కార్మికులకు వీటిపై పూర్తి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అయితే, మానవ నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలు, యంత్రాలలో లోపం, యంత్రాలను సరిగా వినియోగించకపోవడం వల్ల కూడా పేలుళ్లు జరిగే అవకాశం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

పరికరాల లోపాలు కూడా పేలుళ్లకు కారణమే

పరిశ్రమల్లో వాడే పరికరాల్లో లోపాలు కూడా ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. పాతబడిపోయిన పరికరాలు వాడటం, లేదా వాటి నిర్వహణ సరిగా ఉండకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. రియాక్టర్లు, బాయిలర్లు, పైప్‌లైన్‌లు, స్టోరేజ్ ట్యాంకుల అంతర్గత పీడనం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేక పేలిపోయే ప్రమాదం ఉంది. లీకేజీలు, తుప్పుపట్టడం, పూర్తిగా అరిగిపోవడం, సరిగా నిర్వహణ పనులు లేక మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల పరికరాలు బలహీనంగా మారి అధిక ఒత్తిడి లేదా ఉష్ణోగ్రత ఏర్పడినప్పుడు అవి పేలిపోతుంటాయని నిపుణులు చెబుతున్నారు.

యంత్రాల వైఫల్యం వల్ల పేలుళ్లు జరగవచ్చు

పరిశ్రమల్లో వాడే పంపులు, కంప్రెసర్‌లు, కూలింగ్ సిస్టమ్స్ వంటి కీలక యంత్రాలు సరిగా పనిచేయకపోయినా పేలుళ్లు జరుగుతాయి. ఈ యంత్రాలు సరిగా పని చేయకపోతే నియంత్రణ కోల్పోయి పేలుళ్లు జరిగే అవకాశం ఉంది. వీటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేసి, సరిగా ఉందో లేదో సరి చూసుకోవాల్సి ఉంది.

సేఫ్టీ వాల్వ్‌లు పాడైనా ప్రమాదాలు

పరిశ్రమల్లో సేఫ్టీ వాల్వ్‌లు అత్యంత కీలకమైనవి. వీటిని బాయిలర్లు, రియాక్టర్లు, ప్రెషర్ వెసెల్స్, పైప్‌లైన్‌లు, రిఫ్రిజిరేషన్ సిస్టమ్స్ వంటి వాటిల్లో పీడనాన్ని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. ఇవి అధిక పీడనం వల్ల ఏర్పడే ప్రమాదాల నుండి కార్మికులను, యంత్ర సామగ్రిని కాపాడటానికి ఉపయోగపడతాయి. ఇవి ఫెయిల్ అయితే అధిక పీడనం ఏర్పడి పేలుళ్లు సంభవించే అవకాశం ఉంది.

యంత్రాల వైఫల్యాలు

పరిశ్రమలోని బాయిలర్లు, కంప్రెసర్‌లు, కూలింగ్ సిస్టమ్, రియాక్టర్లు వంటి యంత్రాలు గరిష్ట పీడనం ఎంతో అంతవరకు పని చేస్తాయి. అంతకన్నా పీడనం ఎక్కువైతే సేఫ్టీ వాల్వ్ తెరచుకోవాలి. ఇందుకోసం అవసరమైన సెన్సార్‌లు, ఇతర మెకానిజం ఏర్పాట్లతో వీటిని తయారు చేస్తారు. ఇవి ఫెయిల్ అయినప్పుడు ఆ అధిక పీడనం తట్టుకోలేక బాయిలర్లు, రియాక్టర్లు, ఇతర యంత్రాలు వాటి నిర్మాణం ఆ పీడన ఒత్తిడిని తట్టుకోలేక పేలిపోతాయి.

 

విద్యుత్ లోపాలు కారణమే

పరిశ్రమల్లో విద్యుత్ లోపాల కారణంగా కూడా పేలుళ్లు జరుగుతాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్నిసార్లు అధిక విద్యుత్ ప్రవాహం జరగవచ్చు. దీని వల్ల వైర్లు కాలిపోయి మంటలు చెలరేగే అవకాశం ఉంది. ఈ మంటలు పక్కనే ఉన్న మండే అవకాశం ఉన్న రసాయన పదార్థాలు, వాయువులు లేదా ఇతర ద్రవాల డ్రమ్ములు అంటుకుని పేలే అవకాశం ఉంది. ఓవర్‌లోడింగ్, వైరింగ్ లోపాలు, పాత వైర్లు వాడటం, విద్యుత్ పరికరాలు ఫెయిల్ అవ్వడం కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటి వల్ల రసాయన పరిశ్రమల్లో, మండే స్వభావం ఉన్న ద్రవాలు, వాయువుల కారణంగా పేలుళ్లు జరిగే అవకాశం ఉంటుంది.

నిర్లక్ష్యం - తప్పిదాల కారణంగా

మానవ తప్పిదాలు, నిర్లక్ష్యం కారణంగా పరిశ్రమల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిశ్రమలో భద్రతా నియమాలు, అందుకు ఏర్పాటు చేసిన ప్రమాణాలను పరిశ్రమల్లో పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. బాయిలర్లు, రియాక్టర్లు, కూలింగ్ కంప్రెసర్‌లు వంటి చోట పని చేసే కార్మికులకు సరైన శిక్షణ లేకపోవడం కూడా ప్రధాన కారణం. దీంతో పాటు, యంత్రాలు, ఇతర పరికరాలను సరిగా వినియోగించకపోవడం, పాడైతే వెంటనే మార్చకపోవడం, పరిశ్రమల్లో వాడే రసాయన పదార్థాలను ఇష్టారీతిన ఎక్కడపడితే అక్కడ నిల్వ చేయడం, రక్షణ పరికరాలు వినియోగించకపోవడం వంటి అంశాలు కూడా పరిశ్రమల్లో భారీ ప్రమాదాలకు, పేలుళ్లకు కారణంగా చెప్పవచ్చు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Bhu Bharati Scams: ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
Netflix Upcoming Movies Telugu: నెట్‌ఫ్లిక్స్‌ జాతర... పవన్ 'ఉస్తాద్' to వెంకీ 'ఏకే 47', చరణ్ 'పెద్ది' వరకు... 2026లో వచ్చే కొత్త సినిమాలు ఇవే
నెట్‌ఫ్లిక్స్‌ జాతర... పవన్ 'ఉస్తాద్' to వెంకీ 'ఏకే 47', చరణ్ 'పెద్ది' వరకు... 2026లో వచ్చే కొత్త సినిమాలు ఇవే

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Bhu Bharati Scams: ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
ధరణి పోయి భూభారతి వచ్చె.. కానీ తీరు మారలేదా? లోపాల పుట్టగా కొత్త పోర్టల్!
YSRCP Viral Video : 'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
'శ్రీకాకుళం జిల్లాలో కాలం చెల్లిన బీర్లు' సోషల్ మీడియాలో వైసీపీ పోస్టు వైరల్!  
Hyderabad TDR Policy 2026: మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
మూసీ ప్రాజెక్టు కోసం రేవంత్ ప్రభుత్వం మాస్టర్ స్కెచ్‌! టీడీఆర్‌లో భారీ మార్పులు! భూ యజమానులకు ఆఫర్‌, బిల్డర్లకు కొత్త రూల్స్‌!
Netflix Upcoming Movies Telugu: నెట్‌ఫ్లిక్స్‌ జాతర... పవన్ 'ఉస్తాద్' to వెంకీ 'ఏకే 47', చరణ్ 'పెద్ది' వరకు... 2026లో వచ్చే కొత్త సినిమాలు ఇవే
నెట్‌ఫ్లిక్స్‌ జాతర... పవన్ 'ఉస్తాద్' to వెంకీ 'ఏకే 47', చరణ్ 'పెద్ది' వరకు... 2026లో వచ్చే కొత్త సినిమాలు ఇవే
Iran vs America : ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
ఇరాన్ విషయంలో డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు! ఇకపై జోక్యం చేసుకోకూడదని నిర్ణయం!
The Raja Saab Box Office Collection Day 8: బాక్స్ ఆఫీస్ బరిలో ప్రభాస్ 'రాజా సాబ్' బోల్తా... ఇండియాలో 8 రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?
బాక్స్ ఆఫీస్ బరిలో ప్రభాస్ 'రాజా సాబ్' బోల్తా... ఇండియాలో 8 రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?
Dog Viral Video:హనుమంతుని విగ్రహం చుట్టూ కుక్క 72 గంటలుగా ప్రదక్షిణలు! వైరల్ అవుతున్న వీడియో చూశారా?
హనుమంతుని విగ్రహం చుట్టూ కుక్క 72 గంటలుగా ప్రదక్షిణలు! వైరల్ అవుతున్న వీడియో చూశారా?
Phone Expiry Date: ఫోన్‌కి కూడా ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుంది! తెలుసుకోవడం ఎలా? వాడితో జరిగే నష్టమేంటీ?
ఫోన్‌కి కూడా ఎక్స్‌పెయిరీ డేట్ ఉంటుంది! తెలుసుకోవడం ఎలా? వాడితో జరిగే నష్టమేంటీ?
Embed widget