By: ABP Desam | Updated at : 09 Mar 2022 07:54 PM (IST)
ఆ లక్ష ఉద్యోగాలేవి ? కేసీఆర్‌ను ప్రశ్నించిన కాంగ్రెస్ , బీజేపీ !
తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనపై కాంగ్రెస్ , బీజేపీ నేతలు విమర్శలుగుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను మాయం చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కోర్టు కేసులు, ఇతరత్రా సాకులతో ఉద్యోగాల భర్తీని వాయిదా వేస్తే సహించబోమన్నారు. ఈ విషయంలో కేసీఆర్ కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా... ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికల్లోకి వెళ్లబోమని ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ, కొత్త జోనల్ విధానం ఆలస్యం కావడానికి కేంద్రమే కారణమన్న కేసీఆర్ వ్యాఖ్యలపై సంజయ్ తీవ్రంగా స్పందించారు. నోటిని అదుపులో ఉంచుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కొత్త జోనల్ వ్యవస్థకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదలైన 40 నెలల దాకా స్పందించని కేసీఆర్... తన చేతగానితనాన్ని కేంద్రంపై నెట్టడం సిగ్గు చేటన్నారు.
ఈ ఉద్యోగాల ప్రకటన బీజేపీ సాధించిన విజయమని బండి సంజయ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయకుంటే నిరుద్యోగులతో కలిసి హైదరాబాద్ లో ‘మిలియన్ మార్చ్’ నిర్వహిస్తామని ప్రకటించామని.. ఇంటెలిజెన్స్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ కు వెన్నులో వణుకుపుట్టిందన్నారు. ఆగమేఘాల మీద అసెంబ్లీలో ఉద్యోగ ప్రకటన చేశారన్నారు. 8 ఏండ్ల నుండి పిల్లల్ని అరిగోస పెట్టి వందల మంది ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమయ్యారనిఆరోపించారు. ఉద్యోగాల భర్తీ కేంద్రం వల్ల ఆలస్యం అయిందని కేసీఆర్ ప్రకటించడాన్ని బండి సంజయ్ తప్పు పట్టారు. కేసీఆర్ నిర్లక్ష్యంవల్ల నిరుద్యోగులు నాలుగేళ్ల కాలాన్ని పోగొట్టుకున్నారన్నారు. నీకు చేతగానిదంతా కేంద్రమ్మీద తోసేయడం నీకు అలవాటైందని విమర్శించారు. కరోనా టైంలో ప్రాణాలకు తెగించి సేవలందించిన కాంట్రాక్టు డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది మెడమీద కత్తి వేలాడుతోంది. వాళ్లను రెగ్యులరైజ్ చెయ్. టిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగులంతా ఎప్పుడు ఉద్యోగం పోతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారన్నారు. బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ప్రకారం 1 లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బకాయిలతో సహా నిరుద్యోగ భ్రుతి ఇచ్చేదాకా మా పోరాటం ఆగదని హెచ్చరించారు.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా లక్ష ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గతంలో లక్ష ఏడూ వేలు ఖాళీలు ఉన్నాయని, మరొక 50 వేలు ఖాళీ కాబోతున్నాయని 7 సెప్టెంబర్ 2014 చెప్పారన్నారు. లక్ష 50 వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారు.. బిస్వాల్ కమిటీ లక్ష 91 వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పారని గుర్తు చేశారు. 39 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ అబద్ధాలు చెప్పాడని, లక్ష 50 వేలు ఖాళీలు ఉన్నాయని, 80 వేలు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని ప్రకటించాడన్నారు. మిగిలిన ఉద్యోగాలు కాకి ఎత్తుకు పోయిందా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ని ఉద్యోగాలు అడుక్కోవాల్సిన అవసరం లేదని, 12 నెలలలో మన ప్రభుత్వం అధికారం లోకి వస్తుందని, కేసీఆర్ ఉద్యోగం పోతే తప్ప నిరుద్యోగులు కు ఉద్యోగాలు రావని ఆయన మండిపడ్డారు. పైగా ఇప్పుడు ప్రకటించిన ఖాళీలు ఎప్పటి లోపు భర్తీ చేస్తారో చెప్పలేదన్నారు.
Woman Police SHO: మరో మహిళా పోలీస్‌కు అరుదైన గౌరవం, ఎస్‌హెచ్‌వోగా నియమించిన నగర కమిషనర్
Age Limit For Police Jobs: పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచండి, సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్
Road Accident At Balakrishna House: జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం, ఒక్కసారిగా హీరో బాలకృష్ణ ఇంటి వైపు దూసుకొచ్చిన వాహనం !
Karate Kalyani : కలెక్టర్ ఎదుట హాజరైన కరాటే కల్యాణి - పాప దత్తతపై యూటర్న్ !
Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్ తగ్గింపు - వారికి మాత్రమే !
YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?
Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?
Bhavani Island: పర్యాటక అద్బుతం విజయవాడ భవానీ ఐల్యాండ్, నది మధ్యలో ప్రకృతి అందాలు