అన్వేషించండి

KCR Attends Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తోన్న ప్రధాన ఆరోపణలేంటీ?

KCR Attends Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో రూ. 38,500 కోట్లకు అంచనా వేస్తే, ఆ తర్వాత దాన్ని రూ. 1.20 లక్షల కోట్లకు పెంచడం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది.

KCR Attends Kaleshwaram Inquiry: కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కమిషన్ ఛైర్మన్ పినాకినీ చంద్ర ఘోష్ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిస్తున్నారు. ఈ వివాదంలో ఇప్పటివరకు కాంగ్రెస్ చేసిన ఆరోపణలు ఏంటి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణంపై విచారణకు ఆదేశించిందన్న అంశాలు ఇప్పుడు చూద్దాం.

1. ప్రాజెక్టు అంచనా వ్యయం అసాధారణ రీతిలో పెంపు

కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం భారీగా పెంచారని, ఇది అసాధారణంగా ఉందన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రధాన ఆరోపణ. ప్రాజెక్టు ప్రారంభించే సమయంలో రూ. 38,500 కోట్లకు అంచనా వేస్తే, ఆ తర్వాత ఈ అంచనా వ్యయాన్ని రూ. 1.20 లక్షల కోట్లకు పెంచారని కాంగ్రెస్ వాదిస్తోంది. కమీషన్ల కోసమే తప్ప, అంచనా వ్యయం పెంచడానికి సరైన కారణం లేదన్నది కాంగ్రెస్ వాదన. ప్రాజెక్టు పనికి అయ్యే ఖర్చు కన్నా ఎన్నో రెట్లు ఖర్చు పెరగడానికి కారణం బీఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతే అన్న ఆరోపణ కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు.

2. కాళేశ్వరం డిజైన్లో, నిర్మాణంలో నాణ్యతా లోపాలు

కాళేశ్వరం డిజైన్ తప్పు అన్నది కాంగ్రెస్ పార్టీ వాదన. డిజైన్ లోపభూయిష్టంగా ఉంది. అంతే కాకుండా నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలను కనీస మాత్రం పాటించలేదన్నది మరో ఆరోపణ. డిజైన్ల లోపం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు గురయిందని ఉదాహరణగా చెబుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే పిల్లర్లు కుంగిపోయాయని చెబుతోంది. ప్రాజెక్టులో ఎన్నో లీకేజీలు, పగుళ్లు ఉన్నాయని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని పదే పదే చెబుతుంటే, ఇది ఇంజనీరింగ్ వైఫల్యంగా కాంగ్రెస్ అభివర్ణించింది.

3. రాష్ట్రంపై రుణ భారం రుద్దిన కాళేశ్వరం ప్రాజెక్టు

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నాటి ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు తీసుకుందని, కానీ ఆ మొత్తాన్ని ప్రాజెక్టును నాణ్యతతో నిర్మించకుండా నిధులను దుర్వినియోగం చేసిందన్నది కాంగ్రెస్ ఆరోపణ. ఇది తెలంగాణ భవిష్యత్తు తరాలకు మోయలేని రుణ భారంగా కానుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రాజెక్టు ప్రారంభంలో చెప్పిన రీతిలో సాగునీరు అందలేదని, కానీ వేల కోట్ల రూపాయలు మాత్రం ఖర్చు జరిగిందని, ప్రజాధనాన్ని గులాబీ పార్టీ దుర్వినియోగం చేసిందని హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ డబ్బులు ఎవరి ఖజానాలోకి చేరాయన్నది తేలాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

4. మేడిగడ్డకు ప్రాజెక్టు మార్చడం వెనుక కుట్ర

బీఆర్‌ఎస్ సర్కార్‌కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద తక్కువ అంచనా వ్యయంతో ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది. అయితే దాన్ని కేసీఆర్ ప్రభుత్వం మేడిగడ్డకు మార్చారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నది కాంగ్రెస్ ఆరోపణ. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీరు పారే అవకాశం ఉందని, చాలా తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చని చెబుతోంది. 80 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు రూపకల్పన చేస్తే, దాన్ని మేడిగడ్డకు మార్చడం వల్ల వ్యయం పెరిగిందని, అది కమీషన్ల రూపంలో గులాబీ నేతల జేబుల్లోకి వెళ్లాయన్నది ప్రధాన ఆరోపణ.

5. కాళేశ్వరం పనులు పారదర్శకంగా జరగలేదు

కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో కేసీఆర్ ప్రభుత్వం పారదర్శకత పాటించలేదన్నది మరో ఆరోపణ. పనుల పర్యవేక్షణలో పూర్తిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని, దీనికి కేసీఆర్ బాధ్యుడు అన్నది కాంగ్రెస్ నేతల ఆరోపణ. దీనిపై అవినీతి ఆరోపణలు వస్తే కనీసం మాత్రం పట్టించుకోకపోవడం ఉద్దేశపూర్వకమైన చర్యగా హస్తం నేతలు చెబుతున్నారు.

6. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుతో ప్రజా ధనం వృథా

తెలంగాణ పొలాలను సస్యశ్యామలం చేస్తామని చెప్పుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆశించిన ఫలితాలు ప్రజలకు దక్కలేదని కాంగ్రెస్ చెబుతోంది. బ్యారేజీలు కుంగిపోవడం, పిల్లర్లు దెబ్బతినడం ద్వారా ప్రజల సొమ్ము వృథా అయిందని హస్తం నేతల తీవ్ర ఆరోపణ. దీనిపై విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

 

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget