Weather Updates: ఏపీలో తేలికపాటి జల్లులు - తెలంగాణలో భానుడి ప్రతాపంతో ఆ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు
Telangana Temperature Today: ఏపీలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనుడగా, కొన్ని జిల్లాల్లో ఎండలతో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
Light Rain Likely to occur at Isolated Places Andhra Pradesh: దక్షిణ బంగాళాఖాతం నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాల్లో మరో రెండు వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనుడగా, కొన్ని జిల్లాల్లో ఎండలతో వడగాల్పులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలను అలర్ట్ చేశారు. దక్షిణ బంగాళాఖాతంలో మార్పుల ప్రభావంతో ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీస్తున్నాయి. ఏపీ, యానాంలో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం నేడు కూడా చల్లగా ఉంటుంది. దక్షిణ బంగాళాఖాత నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో ఈ ప్రాంతాల్లో మరో రెండు, మూడు రోజులు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో నేడు కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని అధికారులు సూచించారు.
District wise weather warnings for next 5 days for Andhra Pradesh Dated 11.04.2022. pic.twitter.com/Haoi9hybo4
— MC Amaravati (@AmaravatiMc) April 11, 2022
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ.. (AP Temperature Today)
రాయలసీమలో, దక్షిణ కోస్తాంధ్రలో ఉక్కపోత, వేడి మరింత పెరగనుంది. ఈ రోజు రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 నుంచి 41 డిగ్రీల దాక నమోదు కానున్నాయి. రాయలసీమలోని ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నిన్న కొన్ని చోట్ల చిరు జల్లులు కురిశాయి. నేటి నుంచి సీమలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
బంగాళాఖాతం నుంచి వీస్తున్న చలి గాలుల ప్రభావం తెలంగాణలో కొన్ని జిల్లాలపై ఉంది. హైదరాబాద్ వాసులకు మాత్రం ఎండల నుంచి ఏమాత్రం ఊరట లభించడం లేదు. నిన్న సైతం 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు కాగా, వేడి ఉక్కపోత అలాగే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా ఆదిలాబాద్ లో 41.3 డిగ్రీలు, మెదక్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో 40 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మరో రెండు రోజుల్లో తెలంగాణకు వర్ష సూచన ఉన్నట్లు స్పష్టం చేసింది.