Weather Updates: తగ్గేదేలే అంటున్న సూర్యుడు - అగ్నిగుండంలా మారిన రాయలసీమ, తెలంగాణలో 42 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు
Telangana Temperature Today: నేడు సైతం రెండు రాష్ట్రాల్లో వాతావరణం మరింత పొడిగా మారనుంది. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉన్నా, ఎలాంటి వర్ష సూచన లేదని వాతావరణ కేంద్రం తెలిపింది.
AP Weather Updates: భానుడి ప్రతాపంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. నేడు సైతం రెండు రాష్ట్రాల్లో వాతావరణం మరింత పొడిగా మారనుంది. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటడంతో స్వల్ప వర్షాలు కురియనున్నాయని భారత వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కానీ వర్షాలు కురిసే అవకాశం లేదని స్థానిక వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో వేడి, ఉక్కపోత అధికం అవుతుంది. వర్షాలు, మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం సాధారణంగా ఉండనుంది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలకు ఎండల నుంచి కాస్త ఊరట లభిస్తుంది. వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. అయితే అమరావతి వాతావరణ కేంద్రం మాత్రం ఎలాంటి వర్ష సూచన చేయలేదు. అత్యధికంగా నందిగామలో 37.1 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదు కాగా, విశాఖ, తునిలో 36 డిగ్రీలు, కావలిలో 35 డిగ్రీలు, నెల్లూరులోనూ 35.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రలు ఉన్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల దాక ఎండల తీవ్రత ఉంటుంది. కడప, అనంతపురం జిల్లా తూర్పు భాగాల్లో మేఘావృతమై ఉంటుంది. కానీ వర్ష సూచన లేదు. మధ్యాహ్నం వేళ అవసరమైతే తప్ప దక్షిణ కోస్తాంధ్ర, సీమ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ప్రతిరోజూ దాదాపు 5 లీటర్ల వరకు నీళ్లు తాగాలని సూచిస్తున్నారు. అనంతపురంలో 40.1 డిగ్రీలు, కర్నూలులో 39.4 డిగ్రీలు, కడపలో 38.4 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Impact based forecast for Andhra Pradesh dated 07.04.2022 pic.twitter.com/c5SRqhJeOd
— MC Amaravati (@AmaravatiMc) April 7, 2022
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉన్నా ఎక్కడ వర్ష సూచన లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలుల ప్రభావంతో వాతావరణం ఇక్కడ మరింత వేడెక్కుతోంది. ఆదిలాబాద్‌లో 41.8 డిగ్రీలు, నల్గొండలో 39 డిగ్రీలు, నిజామాబాద్‌లో 40.3 డిగ్రీలు, మెదక్‌లో 40.3 డిగ్రీలు, మహబూబ్ నగర్ జిల్లాలో 39 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: KCR : వరి పోరులో బీజేపీని ఫిక్స్ చేయనున్న కేసీఆర్ - 12వ తేదీనే ముహుర్తం ?
Also Read: Lucky Five : ఆ ఐదుగురు ఎవరు ? జగన్ కేబినెట్‌లో కొనసాగే వారెవరు ?