By: ABP Desam | Updated at : 07 Apr 2022 11:25 PM (IST)
వడ్ల పోరుపై 12న కేసీఆర్ కీలక ప్రకటన
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ( CM KCR )కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలు రకాల ఆందోళనల ద్వారా కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. పదకొండో తేదీన పార్టీ యంత్రాంగం మొత్తం ఢిల్లీలో నిరాహారదీక్ష చేయనున్నారు. అప్పటికే కేంద్రం స్పష్టత ఇవ్వకపోతే 12వ తేదీన కేసీఆర్ సంచలన ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ సంచలన ప్రకటన ఏమిటన్నదానిపై ఇప్పుడు టీఆర్ఎస్‌లో ( TRS )విస్తృతంగా చర్చ జరుగుతోంది.
డ్రగ్స్, అవినీతిపై అమిత్ షాకు తమిళిసై నివేదిక - గవర్నర్‌తో పంచాయతీ ఏం లేదన్న కేటీఆర్ !
రైతులు నష్టపోకూడదన్నదే టీఆర్ఎస్ ధ్యేయం కాబట్టి రైతులు ఎన్ని వడ్లు పండించినప్పటికీ చివరి ధాన్యం గింజ వరకూ తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసేలా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. వాస్తవానికి యాసంగిలో ( Yasangi ) వరి పంట వేయవద్దని ప్రభుత్వం ప్రచారం చేసింది. ఒక్క వడ్ల గింజ కొనే ప్రసక్తి లేదని సీఎం కేసీఆర్ నేరుగానే తేల్చి చెప్పారు. అయినప్పటికీ రైతులు పెద్ద ఎత్తున పంట వేశారు. ఈ నెలలోనే కోతలు ప్రారంభమవుతాయి.
మరోసారి వివాదాల నాయక్ - ఎంపీ చేతిలో మైక్ లాగేసుకున్న ఎమ్మెల్యే !
కేంద్రం ( Center Governament ) బాయిల్డ్ రైస్ తీసుకోనంటోందని.. అలాగే వడ్లనూ కొనుగోలు చేయనంటోందని ఈ కారణంగానే ధాన్యం పండించవద్దని కేసీఆర్ అప్పట్లో చెప్పారు. అయితే భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం రైతులు వరి వేయాలని.. ఎందుకు కొనరో తాము చూస్తామని ప్రకటించారు. ఈ రాజకీయ నాయకుల భరోసా వల్ల కానీ.. ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన లేకపోవడం కానీ రైతులు యాసంగిలో ఎప్పుడూ పండించేంత వరి పంటను పండిస్తున్నారు. వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం నిరాకరించడంతో ఇప్పుడు తెలంగాణ సర్కారే నేరుగా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.
రైతులను నట్టేట ముంచేందుకు బీజేపీ ( BJP ) ప్రయత్నించిందని.. తాము ఆదుకుంటామని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం మిల్లర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి ఒప్పందం మేరకు ఎఫ్‌సీఐకి ఇచ్చి మిగిలిన ధాన్యాన్ని స్థానికంగానే పంపిణీ చేసే ప్రణాలిక అమలు చేయడమో.. లేకపోతే ఎగుమతి చేయడమో చేసే అవకాశం ఉంది. మొత్తంగా ధాన్యం పై పోరులో బీజేపీని దోషిగా నిలిపి.. రైతుల్ని తాము ఆదుకుంటున్నామని కేసీఆర్ పన్నెండో తేదీన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Breaking News Live Updates : కాంగ్రెస్ లో చేరిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్
Telangana Wines Rates : తెలంగాణలో వైన్స్ రేట్ల పెంపుపై అధికారిక ప్రకటన - కొత్త రేట్లు ఇవిగో
Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త
Hyderabad News : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు, లారీలు బంద్, కొత్త మోటార్ వాహనాల చట్టం రద్దుకు డిమాండ్
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
IPL 2022: ఐపీఎల్ 2022 మెగా ఫైనల్ టైమింగ్లో మార్పు! ఈ సారి బాలీవుడ్ తారలతో..
Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు