Weather Latest Update: నైరుతి రుతుపవనాల ఉపసంహరణ - ఇక పొడి వాతావరణమే: ఐఎండీ
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది.
‘‘రాబోయే రెండు రోజులలో తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు వాయువ్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast):
ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఉత్తర దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 32.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 65 శాతంగా నమోదైంది.
ఏపీలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం
వాయవ్య భారత ప్రాంతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయని, అందుకని కోస్తాలో ఎండ తీవ్రత పెరిగిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నిన్న అక్కడక్కడ రాష్ట్రంలో తేలికపాటి చినుకులు పడ్డాయి. అలాగే రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు పడతాయని.. మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత పెరుగుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది. అలాగే నేడు ఈ జిల్లాల్లో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
సాధారణంగా అక్టోబర్ నెలలో వర్షాలు పడే స్థితులు ఉండగా, ఈ సారి వాటికి భిన్నంగా ఎండలు మరింత ఎక్కువ అవుతున్నాయి. అది కూడా ఎండాకాలాన్ని తలపించే వాతావరణం కొన్ని జిల్లాల్లో కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో పాటూ ఉక్కపోత కూడా చాలా ప్రాంతాల్లో ఉంటోంది. కొన్ని జిల్లాల్లో ఎండ తీవ్రత ఉంటుండగా.. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు ఉంటున్నాయి.