Weather Latest Update: నేడు ఈ జిల్లాల్లో విపరీత వడగాల్పులు, కొన్ని చోట్ల వర్షం కూడా - ఐఎండీ హెచ్చరికలు
Weather News: ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
Weather Latest News: ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి గాలులు దక్షిణ, నైరుతి దిశల నుండి వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది.
ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు (Heat Waves in Telangana) వీచే అవకాశం ఉంది. రాత్రులు సాధారణం కంటే వెచ్చగా వుండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేశారు. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి చినుకులు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో నైరుతి దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.2 డిగ్రీలుగా నమోదైంది. 43 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
నేడు వాతావరణ హెచ్చరికలు
నేడు వడగాల్పులు తెలంగాణలోని ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వరపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉంది. మరోవైపు, ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో (గాలివేగం గంటకు 40 నుంచి 50 కిలో మీటర్లు) కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
వేడి, తేమ పరిస్థితులు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి వేడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.
Andhra Pradesh Weather: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో వాతావరణం పొడిగా ఉంటుందని.. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని తెలిపారు. రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడవచ్చని తెలిపారు.