(Source: ECI/ABP News/ABP Majha)
Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తరు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు కురుస్తాయని వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్, సిద్ధిపేట, జనగాం, సూర్యపేట, నల్కోండ, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: Gold-Silver Price: అతి స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఎగబాకిన వెండి.. మీ నగరంలో నేటి ధరలివీ..
ఏపీలో గత కొద్ది రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. సోమ, మంగళవారం కూడా రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం అధికారులు స్పష్టం చేశారు. అనంతపురం కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మంగళవారం రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Also Read: Amaravati Highcourt : నేటి నుండి అమరావతి వ్యాజ్యాల విచారణ..! హైకోర్టు తేల్చేస్తుందా..?
ఏపీలో అలర్ట్
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇతర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయని, సోమ, మంగళవారాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయని, వీటి ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని పేర్కొంది. అటు దక్షిణ కోస్తా ఆంధ్రాలోనూ ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం వాతావరణశాఖ తెలిపింది.
నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. సోమవారం రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.