Weather Updates: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్... ఏపీలో భారీ వర్షాలు... తెలంగాణలో మోస్తరు వానలు
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్ష సూచన ఇచ్చింది. ఏపీలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. తెలంగాణలో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.
మహారాష్ట్ర విదర్భ ప్రాంతం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరం వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఇవాళ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణకు వర్ష సూచన
ఇవాళ సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్ గిరి, నారాయణ్ పేట్, వనపర్తి, మహబుబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ట్వీట్ చేసింది. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలిపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమ, మంగళవారాల్లోనూ అక్కడక్కడా లేదా ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయమని పేర్కొంది.
Also Read: Rakhi Wishes in Telugu: రాఖీ పండుగ.. ఈ అందమైన కొటేషన్లతో శుభాకాంక్షలు తెలపండి
ఏపీలో భారీ వర్షాలు
ఏపీలో ఇవాళ ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఏపీలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని తెలిపింది. ఈ ద్రోణికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణ, రాయలసీమ మీదుగా కోస్తా తీరం వరకు విస్తరించి ఉంది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు ఏపీ వైపుగా వీస్తున్నాయన్ని పేర్కొంది. రేపటికి ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.
Also Read: Jagan Sharmila Rakhi : జగన్‌కు రాఖీ కట్టేందుకు షర్మిల వెళ్తారా..?
విజయవాడ, విశాఖల్లో
తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. శనివారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. విజయవాడ, విశాఖలో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
Also Read: Horoscope Today : ఈ రాశులవారికి ఈ రోజు చాలా ప్రత్యేకం, ఏ పని చేపట్టినా విజయం మీదే