News
News
వీడియోలు ఆటలు
X

Rakhi Wishes in Telugu: రాఖీ పండుగ.. ఈ అందమైన కొటేషన్లతో శుభాకాంక్షలు తెలపండి

రక్షా బంధన్ సందర్భంగా మీ సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలపాలని అనుకుంటున్నారా? అయితే, ఈ కోట్స్‌తో విష్ చేయండి.

FOLLOW US: 
Share:

అన్నా చెల్లెళ్ల అనుబంధం.. మాటల్లో వర్ణించలేదనిది. తల్లి తర్వత తల్లిగా సోదరి మన బాగోగులు చూస్తే.. తండ్రి తర్వాత తండ్రిగా సోదరులు తమ అక్కచెలెళ్లకు రక్షణగా నిలుస్తారు. ఆ బంధం శాస్వతంగా నిలిచిపోవాలనే ఆకాంక్షతో నిర్వహించే పండుగే ‘రక్షా బంధనం’. ఇంట్లో ఎంత కొట్టుకున్నా.. ఎంత తిట్టుకున్నా.. చివరికి కష్టమొస్తే ఒకరికి తోడుగా ఉండటం ఈ బంధానికే సాధ్యం. ఆ ప్రేమ.. ఆప్యాయతా ఎప్పటికీ వీడిపోరాదనే.. తమ తోబుట్టువు ఎప్పుడూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ.. ఈ కింది కోట్స్‌ను వాట్సాప్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియా వేదికలపై పంచుకుని శుభాకాంక్షలు తెలియజేయండి. 

అన్న.. చెల్లికి విష్ చేయాలంటే ఈ కోట్స్ వాడండి: 
⦿ రాఖీ కట్టి నన్ను మెప్పించే ఓ బుజ్జాయి.. నీ అల్లరే నాకు సంతోషం.
నీ నవ్వులే నాకు సంగీతం.. ఎప్పటికీ నవ్వుతూనే ఉండాలి నా చెల్లాయి.
- రక్షా బంధన్ శుభాకాంక్షలతో నీ అన్నయ్య.

⦿ మనసే మధుమాసం మా చెల్లెమ్మ,
ప్రేమే అనురాగం.. చిరునవ్వుల చెల్లెమ్మ,
ఇంటికి అందం ముద్దుల చెల్లెమ్మ,
నా కంటికి బంగారం మా చెల్లెమ్మ..
- నా ముద్దుల చెల్లికి రాఖీ శుభాకాంక్షలు.

⦿ మమతల మాగాణీలో పూసిన పువ్వులం
స్నేహానురాగాలు నింపుకొన్న నవ్వులం
అనురాగానికి ప్రతీకలం..
అనుబంధానికి ప్రతిరూపాలయిన సోదరీ సోదరులం.
- రక్షా బంధన్ శుభాకాంక్షలు

⦿ అనుబంధాల హరివిల్లు.. ప్రేమాభిమానాల పొదరిల్లు.
గిల్లికజ్జాల సరదాలు.. తోడు నీడగా సాగిన జీవితాలు.
కాలం మారినా, దూరం పెరిగినా.. చెరగని బంధాలు.
అవే అన్నా చెల్లెళ్ల అనుబంధాలు.. కలకాలం నిలవాలి ఈ రక్షాబంధాలు.
- ప్రియమైన చెల్లికి రాఖీ శుభాకాంక్షలు 

⦿ చెల్లమ్మా.. నీకెంత వయసొచ్చినా
నా కంటికి చిన్న పిల్లవే..
కొండంత ప్రేమను పంచి..
నిండుగా దీవించే బంగారు తల్లివి నీవు.
- రక్షా బంధన్ శుభాకాంక్షలు

⦿ బుజ్జగింపు, ఊరడింపులు, పోట్లాటలు, అలకలు..
చిన్ననాటి మధుర స్మృతులను.. 
తిరిగిరాని ఆ రోజులను..
గుర్తు చేసుకుంటూ.. రాఖీ పండుగ శుభాకాంక్షలు.

తమ్ముడు.. అక్కను విష్ చేయాలంటే..:  
⦿ అక్కా.. అమ్మ తర్వాత అమ్మవి నీవు..
కంటికి రెప్పలా చూసుకుంటావు..
నా అల్లరిని ఎన్నోసార్లు నన్ను బరించావు..
కానీ, నా నిశబ్దాన్ని తట్టుకోలేవు..
ఎందుకే.. నేనంటే నీకు అంత ఇష్టం మరి. 
- రాఖీ శుభాకాంక్షలు

⦿ అక్క.. తమ్ముడిని విష్ చేయాలంటే: 
తమ్ముడూ.. నువ్వే నా ధైర్యం..
నువ్వే నా లోకం.. నే తిడితే కోప్పడతావు..
నే అలిగితే డీలా పడతావు..
నాకు కష్టమొస్తే తోడుంటావు..
నా ఆనందానికి కారణమవుతావు. 
ఎంత కొట్టుకున్నా.. మన బంధం వీడనిది, విడదీయనిది.
- సోదరుడికి రాఖీ శుభాకాంక్షలు

చెల్లి అన్నను విష్ చేయాలంటే ఈ కోట్స్ వాడండి:
⦿ అలసిన వేళ అమ్మలా జోలపాడి లాలించిన ఓ అన్నా..
అలిగిన వేళ అలక తీర్చి.. నాన్నవయ్యావు.
చిరునవ్వును పంచి.. అనురాగాలకు అర్థం చెప్పావు.
నీ చల్లని చూపే నాకు చాలు.
- రాఖీ శుభాకాంక్షలతో నీ చెల్లెలు

⦿ అమ్మలో సగం.. నాన్నలో సగం.. మా అన్న. 
నన్ను నీ కంటిపాపలా చూసుకునే ఓ అన్నా..
నీ చల్లటి దీవెనలే నాకు శ్రీరామరక్ష.
- రాఖీ శుభాకాంక్షలు అన్నయ్య

⦿ ఏడిస్తే లాలించావు.. నాకు ఆకలేస్తే కడుపు నింపావు..
చిన్న గాయమైనా అమ్మలా చలించిపోయావు..
నా ఆనందం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నావు..
అన్నయ్యా.. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోను..
మరు జన్మలోనూ నీ చెల్లినై పుట్టాలని కోరుకుంటూ..
- అన్నయ్యకు రాఖీ శుభాకాంక్షలు

⦿ నిను చూస్తేనే పెరిగాను.. నీ వెనుకే తిరిగాను..
నువ్వు భయం చెబుతుంటే నొచ్చుకున్నాను.. 
నా మంచికే చెబుతున్నావని.. ఆనందించా. 
రాఖీ సాక్షిగా.. అన్నయ్యా నన్ను దీవించు..
కలకాలం నన్ను ఇలాగే ప్రేమించు.
- అన్నయ్య నీకు రాఖీ శుభాకాంక్షలు 

Published at : 21 Aug 2021 09:42 PM (IST) Tags: raksha bandhan Raksha Bandhan 2021 raksha bandhan wishes Raksha bandhan quotes rakhi wishes in telugu rakhi wishes రాఖీ శుభాకాంక్షలు రాఖీ 2021

సంబంధిత కథనాలు

ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్‌తో హార్ట్ ఫెయిల్యూర్‌ ముప్పును ముందే తెలుసుకోవచ్చట!

World No Tobacco Day: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!

World No Tobacco Day: సిగరెట్ ఊపిరితిత్తులనే కాదు మీ కంటి చూపుని కాల్చేస్తుంది, తస్మాత్ జాగ్రత్త!

WeightLoss: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ధనియాల నీళ్లతో త్వరగా తగ్గొచ్చు

WeightLoss: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? ధనియాల నీళ్లతో త్వరగా తగ్గొచ్చు

Relationships: నా కూతురు ముందే నా భర్త నన్ను కొట్టాడు, నేను అలానే చేయాలనుకుంటున్నాను

Relationships: నా కూతురు ముందే నా భర్త నన్ను కొట్టాడు, నేను అలానే చేయాలనుకుంటున్నాను

Black Apples: బ్లాక్ డైమండ్ ఆపిల్స్ గురించి విన్నారా? నల్ల వజ్రాల్లా మెరుస్తాయివి

Black Apples: బ్లాక్ డైమండ్ ఆపిల్స్ గురించి విన్నారా? నల్ల వజ్రాల్లా మెరుస్తాయివి

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !