అన్వేషించండి

Weather Latest Update: బంగాళాఖాతంలో ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన - ఐఎండీ వెల్లడి

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.

‘‘ఈ రోజు ఈశాన్య, పరిసరాలలోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక ఆవర్తనం ఏర్పడి, సగటు సముద్ర మట్టం నుండి 5.8 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. ఈ ఆవర్తన ప్రభావం వలన రాగల 48 గంటలలో వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లో ఒక అల్పపీడనం ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు కింది స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు  వర్షాలు అక్కడక్కడ  మరియు ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

హైదరాబాద్‌లో వాతావరణం

హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 06 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 73 శాతంగా నమోదైంది.

ఏపీలో ఇలా
ఈరోజు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు వీయవచ్చు. దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగముతో వీయవచ్చని వాతావరణ అధికారులు తెలిపారు.

‘‘సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షాలు పడ్డాయి. గత మూడు సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది వర్షాలు ఇప్పటి దాకా తక్కువగానే పడింది. రానున్న రోజుల్లో కూడా వర్షాలు ఉన్నా సాధారణం కంటే తక్కువ వర్షాలు కొనసాగనున్నాయి. నేడు ఉపరితల ఆవర్తనం వలన ఉత్తరాంధ్ర జిల్లాలు - శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో సాయంకాలం నుంచి రాత్రి వరకు వర్షాలను, పిడుగులను చూడగలం. భూమి బాగా వేడెక్కినప్పుడు పీడనం ఏర్పడి, ఉపరితల ఆవర్తనం వైపుగా వెళ్తున్న గాలుల్లో బలమైన మేఘాలు ఏర్పడతాయి. నేడు సాయంకాలం విశాఖ నగరంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాత్రికి రాయలసీమ జిల్లాలు - చిత్తూరు, అన్నమయ్యతో పాటుగా మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ, అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు - తిరుపతి, నెల్లూరు జిల్లాల్లోని పలు భాగాల్లో వర్షాలు పడనుంది. మిగిలిన అన్ని జిల్లాల్లో కొద్ది భాగాలకే వర్షాలు పరిమితం కానున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Telangana News: తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
ISRO Chairman : ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
Tirumala Kalyana Ratham:   తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు  శ్రీవారి కళ్యాణ రథం!
తిరుమల నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాకు శ్రీవారి కళ్యాణ రథం!
Embed widget