Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు... చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు తెలిపాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని అధికారులు తెలిపారు.
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో ఇవాళ (ఆగస్టు 19న) కొన్ని జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ఈ జిల్లాల్లోనే భారీ వర్షాలు
హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. రాగల 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపుతో మోస్తరు వర్షాలు అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని అధికారులు తెలిపారు.
Also Read: Petrol-Diesel Price, 19 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. మీ నగరంలో తాజా ధరలివే..
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లో రాగల 4 రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల జల్లు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ జిల్లాలకు మాత్రం ఎలాంటి హెచ్చరిక జారీ చేయలేదు.
అల్పపీడనం ప్రభావం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు పడుతున్నాయి. ఒడిశా తీరం నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ఈ ద్రోణి ప్రభావం వల్ల రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలుచోట్ల ఓ మోస్తరు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడన ద్రోణి తుఫాన్‌గా మారే అవకాశాలు లేవని స్పష్టం చేశారు.
Also Read: Gold-Silver Price: బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి పసిడి, వెండి ధరలివే..
Also Read: IND vs ENG : సూర్యకుమార్, పృథ్వీ షా... వాట్ ఏ కామెడీ టైమింగ్