By: ABP Desam | Updated at : 14 Aug 2021 08:01 AM (IST)
ఏపీ, తెలంగాణలో వాతావరణం (ప్రతీకాత్మక చిత్రం)
తెలంగాణలో మరో రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అది సముద్రమట్టానికి కి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతోందని చెప్పారు. ఈ ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
ఆగస్టు 13 రాత్రివేళ హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే ఆగస్టు 14న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని సూచించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు.
Also Read: Gold-Silver Price: రూ.100 పెరిగిన పసిడి ధర.. వెండి కూడా అదే దారిలో.. తాజా ధరలివే..
తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వానలు పడే అవకాశం
హైదరాబాద్‌లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఇలా..
‘‘ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజులకు సంబంధించి వాతావరణ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం శుక్రవారం ట్వీట్ చేసింది. ఆగస్టు 14న ఉత్తర కోస్తాంధ్రలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 15, 16 తేదీల్లో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.
Also Read: Huzurabad By Elections: హుజూరాబాద్ లో రోజురోజుకు మారుతున్న సమీకరణాలు
ఆగస్టు 14న దక్షిణ కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో ఇవాల్టి (ఆగస్టు 14) నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది’’ అని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకుడు వెల్లడించారు.
Nikhat Zareen : హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
Honor Killing In Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో దారుణం- మతాంతర వివాహం చేసుకుందని కుమార్తె గొంతు కోసి హత్య చేసిన తండ్రి
Breaking News Live Updates: హైదరాబాద్ కు నిఖత్ జరీన్, శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం
Anna Hazare President Candidate KCR Plan: రాష్ట్రపతి అభ్యర్థిగా అన్నా హజారే ! కేసీఆర్ చెబుతున్న సంచలనం అదేనా ?
Neeraj Murder Case: నీరజ్ హత్య కేసు విచారణలో మరో ట్విస్ట్- హెచ్ఆర్సీని ఆశ్రయించిన నిందితుల బంధువులు
F3 Movie Review - 'ఎఫ్ 3' రివ్యూ: వెంకటేష్, వరుణ్ తేజ్ నవ్వించారా? ఫ్రస్ట్రేషన్ తెప్పించారా?
Hyundai Venue Facelift: హ్యుండాయ్ కొత్త వెన్యూ వచ్చేస్తుంది - ఈసారి వచ్చే మోడల్ వేరే లెవల్!
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !
Former Haryana CM: మాజీ సీఎంకు 4 ఏళ్ల జైలు శిక్ష- అక్రమాస్తుల కేసులో సంచలన తీర్పు