(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో నేడు సాధారణ వాతావరణమే - ఉత్తరాదిన వెస్ట్రర్న్ డిస్టర్బెన్స్ ఎఫెక్ట్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ / వాయువ్య దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు గురువారం (ఆగస్టు 10) ఓ ప్రకటనలో తెలిపారు. రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు తూర్పు, ఈశాన్య జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయి కనిపించనుంది. నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 32 డిగ్రీలు, 24 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ, వాయువ్య దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 31.7 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.1 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. గాలిలో తేమ 79 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ నేడు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. అలాగే గాలులు కూడా స్వల్పంగా వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లోనూ నేడు, రేపు అక్కడక్కడ తేలికపాటి చినుకులు ఒకటి లేదా రెండు చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. రాయలసీమలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు ఒకటి రెండు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వివరించారు. కొన్ని చోట్ల బలమైన గాలులు పలు చోట్ల వీచే అవకాశం ఉందని వెల్లడించారు.
‘‘నిన్న తెల్లవారుజామున తెలంగాణలో మొదలైన వర్షాలు నేరుగా మధ్య ఆంధ్ర జిల్లాల్లోకి అడుగుపెట్టనుంది. గత గంట సేపటి వ్యవధిలోనే రాజమండ్రితో సహా తూర్పు గోదావరి జిల్లాలోని పలు భాగాల్లోకి వర్షాలు విస్తరించాయి. కానీ మరో రెండు గంటల్లో కృష్ణా జిల్లాతో పాటుగా కొనసీమ, ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో వర్షాలు విస్తరించనున్నాయి. మరోవైపున ఈ వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉంటుంది. విస్తారంగా ఉండవు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్ధితి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఉత్తరాది వాతావరణం ఇలా
దేశ రాజధాని ఢిల్లీ వాతావరణం వేగంగా మారుతోంది. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా, గత మూడు రోజులుగా మండుతున్న వేడి మరియు తేమ నుండి ప్రజలు ఉపశమనం పొందారు. ఢిల్లీలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ అంచనా) విడుదల చేసిన అంచనాల ప్రకారం ఆగస్టు 12 మినహా ఢిల్లీలో నేటి నుంచి ఆగస్టు 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే, రాబోయే కొద్ది రోజులు ఢిల్లీ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలు కనిపించడం లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది.