Weather Latest Update: దూరంగా కదిలిపోయిన ద్రోణి, మరింత మండిపోనున్న ఎండ - నేడు ఇక్కడ ఆరెంజ్ అలర్ట్
Weather Report: వడగాల్పులు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Weather Latest News: నిన్న మరాత్వాడ నుంచి ఉత్తర తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దూరంగా కదిలిపోయిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయి గాలులు దక్షిణ మరియు ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయని తెలిపారు. ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుందని అన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక్కడ ఆరెంజ్ అలర్ట్
వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ అయింది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 42 డిగ్రీలు, 29 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలుగా నమోదైంది. 37 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో దక్షిణ లేదా నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.