(Source: ECI/ABP News/ABP Majha)
Weather Latest Update: తెలంగాణ, కోస్తా మీదుగా ఆవర్తనం - నేడు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఇదీ - ఐఎండీ
Weather News: ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Weather Latest News: ఉపరితల ఆవర్తనం ఒకటి తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ద్రోణి / గాలి విచ్చిన్నతి ఒకటి తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగుతుంది. నిన్న మధ్య మహారాష్ట్ర నుండి కర్ణాటక మీదుగా కేరళ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో కొనసాగిన ద్రోణి / గాలి విచ్చిన్నతి ఈరోజు బలహీనపడింది. నిన్న దక్షిణ అంతర్గత కర్ణాటక, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ. ఎత్తులో కొనసాగిన ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం వుంది.
వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)
ఈరోజు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మొస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం వుంది.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 41 డిగ్రీలు, 27 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 5 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 40.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలుగా నమోదైంది. 46 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ఉపరితల ఆవర్తనం తెలంగాణ, పరిసర కోస్తాంధ్రప్రదేశ్ లలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ, పరిసర కోస్తా ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ద్రోణి, గాలుల నిలుపుదల దక్షిణ తమిళనాడు వరకూ సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో దక్షిణాన అంతర్గత కర్ణాటక, పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజుగా తక్కువగా ఉందని తెలిపారు.
ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. వేడి తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.