అన్వేషించండి

Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరో 5 రోజులు ఇంతే - ఐఎండీ

Weather Forecast: ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

Weather Latest News: జూలై 15న హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అల్పపీడన ప్రాంతం ఒకటి దక్షిణ ఒడిశా తీరం వద్ద వాయువ్య, దాని పరిసర పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 7.6 కి. మీ. ఎత్తు వరకు ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్నది. ఋతుపవన ద్రోణి ఈరోజు  జైసాల్మయిర్, కోట, సంబల్పూర్, పూరి గుండా వెళుతూ, వాయువ్య, పరిసర పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై వున్న అల్పపీడన ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో కొనసాగుతున్నది.

గాలి విచ్చిన్నతి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. నుండి 7.6 కి. మీ ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉన్నది. మరొక అల్పపీడన ప్రాంతం జులై 19 తేదీన పశ్చిమ - మధ్య, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం వుంది. నిన్న గంగేటిక్ పశ్చిమ బెంగాల్ దానిని ఆనుకొని వున్న ఝార్ఖండ్, ఒడిశా ప్రాంతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి. మీ. ఎత్తులో కేంద్రీకృతమై వున్న ఆవర్తనం ఈరోజు బలహీనపడింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన (Weather Forecast): 
ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది.

వాతావరణ హెచ్చరికలు (Weather Warnings)
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం వుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ కురిసే వర్షాలు అవకాశం వుంది.

జూలై 16న భారీ వర్షాలు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. జూలై 18న తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలియజేశారు. ఆరోజు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.

Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిసార్లు మెరుపులు, ఈదురుగాలులతో 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో సంభవించే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశలో వీచే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 8 - 12 కిలో మీటర్ల వేగంతో పశ్చిమ - దక్షిణ దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 29.1 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.6 డిగ్రీలుగా నమోదైంది. 62.5 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.

ఏపీలో వాతావరణం ఇలా
Andhra Pradesh Weather News: ‘‘వాయువ్య, దానిని ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా తీరంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకు విస్తరించి ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంటుంది. సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, కోట, గుణ, దామెహ్, పెండ్రా రోడ్, సంబల్పూర్, పూరి గుండా వెళ్తూ ఆగ్నేయ దిశగా వాయువ్య, అనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం, సగటు సముద్రమట్టానికి 1.5 కిలో మీటర్ల వరకూ ఉంది’’ అని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

జూలై 15న అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తాలోనూ ఓ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో కూడా వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రాయలసీమలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది. ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 2 Exams Schedule: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల - డేట్, టైమింగ్స్ ఇవే
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల - డేట్, టైమింగ్స్ ఇవే
KTR: రేవంత్-రాహుల్ మధ్య చాలా విభేదాలు, మీ ఎంపీలు గాడిదలు కాస్తారా? - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రేవంత్-రాహుల్ మధ్య చాలా విభేదాలు, మీ ఎంపీలు గాడిదలు కాస్తారా? - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్‌- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు
రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్‌- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు
Kolkata: సామూహిక అత్యాచారం జరగలేదు, ఒక్కడే ఈ పని చేశాడు - కీలక విషయం బయటపెట్టిన DNA రిపోర్ట్‌
సామూహిక అత్యాచారం జరగలేదు, ఒక్కడే ఈ పని చేశాడు - కీలక విషయం బయటపెట్టిన DNA రిపోర్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 2 Exams Schedule: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల - డేట్, టైమింగ్స్ ఇవే
తెలంగాణ గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల - డేట్, టైమింగ్స్ ఇవే
KTR: రేవంత్-రాహుల్ మధ్య చాలా విభేదాలు, మీ ఎంపీలు గాడిదలు కాస్తారా? - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
రేవంత్-రాహుల్ మధ్య చాలా విభేదాలు, మీ ఎంపీలు గాడిదలు కాస్తారా? - కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Telangana News: రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్‌- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు
రేసుగుర్రంలా దూసుకెళ్తున్న హైడ్రా రంగనాథ్‌- రేవంత్‌పైకి దూసుకొస్తున్న రాజకీయ బుల్డోజర్లు
Kolkata: సామూహిక అత్యాచారం జరగలేదు, ఒక్కడే ఈ పని చేశాడు - కీలక విషయం బయటపెట్టిన DNA రిపోర్ట్‌
సామూహిక అత్యాచారం జరగలేదు, ఒక్కడే ఈ పని చేశాడు - కీలక విషయం బయటపెట్టిన DNA రిపోర్ట్‌
Dengue fever : ప్రాణాంతకంగా మారుతున్న డెంగ్యూ ఫీవర్ - భారీగా కేసులు - డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు ఇవే
ప్రాణాంతకంగా మారుతున్న డెంగ్యూ ఫీవర్ - భారీగా కేసులు - డాక్టర్లు చెబుతున్న జాగ్రత్తలు ఇవే
Chiranjeevi 157 Movie: చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ అందుకే ఇవ్వలేదా? కుమార్తెతో సినిమాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకో?
చిరంజీవి కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ అందుకే ఇవ్వలేదా? కుమార్తెతో సినిమాకు ఇన్ని ఇబ్బందులు ఎందుకో?
Telangana News: 119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ధర్నాలు - యాదాద్రిలో హరీష్‌రావు ప్రమాణం
119 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ ధర్నాలు - యాదాద్రిలో హరీష్‌రావు ప్రమాణం
Atchutapuram SEZ Accident : పెళ్లి షాపింగ్ చేసి డ్యూటికెళ్లి మృతి చెందారొకరు- రాఖీ కట్టి ఆనందంగా వెళ్లి శవమైంది మరొకరు- ఫార్మా ప్రమాద మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
పెళ్లి షాపింగ్ చేసి డ్యూటికెళ్లి మృతి చెందారొకరు- రాఖీ కట్టి ఆనందంగా వెళ్లి శవమైంది మరొకరు- ఫార్మా ప్రమాద మృతుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ
Embed widget