అన్వేషించండి
Advertisement
Warangal Accident: వరంగల్‌లో ఘోర ప్రమాదం, నలుగురు అక్కడికక్కడే దుర్మరణం
వర్ధన్నపేట మండలం ఇల్లంద దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వరంగల్ జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆటోను ఎదురు నుంచి లారీ ఢీకొట్టింది. వరంగల్ నుంచి తొర్రూరు వైపు ఆటో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలు అయ్యారు. లారీ డ్రైవర్ తాగేసి డ్రైవింగ్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
వర్ధన్నపేట మండలం ఇల్లంద దగ్గర ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మరో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ ఫూటుగా మద్యం సేవించి, రాంగ్ రూట్‌లో వచ్చాడని అందుకే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ప్రమాదం ధాటికి ఆటో నుజ్జునుజ్జు అయిపోయింది. మృతదేహాలన్నీ ఆటోలోనే చిక్కుకుపోగా, స్థానికులు బయటకు తీసే ప్రయత్నం చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement