అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Warangal: వరంగల్‌లో ఈ బావుల గురించి తెలుసా? పూర్తిగా తగ్గిన ప్రాభవం!

Warangal News: వరంగల్ నగరంలో పూర్వం కాకతీయుల కాలంలో నిర్మితమైన బావులకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. కానీ, ఇప్పుడు వాటి ప్రాభవం పూర్తిగా మసకబారింది.

Warangal City News: కాకతీయులు అనగానే శిల్ప సంపద, చారిత్రక ఆలయాలు, గొలుసుకట్టు చెరువులు గుర్తుకు వస్తాయి. నీటిపై ప్రత్యేక దృష్టి సాధించిన కాకతీయులు ప్రజా అవసరాలకు చెరువులతో పాటు బావులను కూడా తవ్వించారు. కాకతీయ రాజులు తవ్వించిన బావులు చతురస్రం, దీర్ఘ చతురస్రం ఆకారంలో ఉంటాయి. అలాంటి బావులు కాకతీయ కోటలో పదుల సంఖ్యలో ఉంటాయి.

కాకతీయులు ట్రిబుల్ టీ పేరుతో టౌన్, టెంపుల్, ట్యాంక్ ఏర్పాటు చేశారు. కాకతీయుల సామ్రాజ్యంలో నీటిపారుదల రంగం ఇప్పటి పటిష్టంగా ఉందంటే కాకతీయ రాజుల ముందు చూపుగా చెప్పాలి. వరంగల్ రాజధానిగా కాకతీయుల పాలనసాగిన నేపథ్యంలో ముఖ్యంగా ఓరుగల్లు పట్టణ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆ కాలపు ఇంజనీర్లు తవ్వించిన చెరువులు, మెట్ల బావులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా కనిపిస్తాయి. 800 ఏళ్ల క్రితం నిర్మించిన బావులు అయినా ఇప్పటికి తరగని నీటి సంపద ఈ బావుల స్వంతం. వినుకొండ వల్లభ రాయుడు 14 వ శతాబ్దంలో రాసిన క్రీడాభిరామంలో కాకతీయులు ఓరుగల్లులో 365 మెట్ల బావులు తవ్వించినట్లు చెప్పడం జరిగింది. ప్రతి వాన చుక్క వృథా కాకుండా 365 రోజులు నీరు నిలువ ఉండేలా కోనేరులు, బావులను తవ్వించారు. ప్రధానంగా కాకతీయుల రాజధాని కోట, వరంగల్ చుట్టూ ప్రక్కల సాధారణ బావులతో పాటు ఎక్కువగా మెట్ల బావుల నిర్మాణానికి ప్రాధాన్యమించారు. ఎందుకటే ఆకాలంలో మోటర్లు, పంపు సెట్లు లేవు కాబట్టి ప్రజలు కాలంలోనైనా సులువుగా నీటిని తోడుకునేందుకు మెట్ల బావులను నిర్మించడం కాకతీయుల సాంకేతిక టెక్నాలజీకి నిదర్శనం. ఈ బావులన్నీ చతురస్ర, దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉంటాయి.

11, 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ బావులు కాకతీయ కోట పరిసర ప్రాంతాలు, వరంగల్ సిటీ మధ్యలో ఉన్నాయి. ఇందులో శివనగర్ మెట్ల బావి, ఈసన్న బావి, అక్క చెల్లెల బావి, సవతుల బావి, కోడికూతల బావి, గడియారం బావి, శృంగార బావి, జంగమయ్య బావి, కొత్తగూడ గోపాలస్వామి బావి, దర్గా బావి, కొండ మసీదు బావి, తూర్పుకోట హనుమాన్ గుడి బావి ఇలా 21 బావులు సిటీలో ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు. చారిత్రక ఈ బావులను భావి తరాలకు అందించాలంటే మిషన్ కాకతీయ పేరుతో చెరువులను పునరుద్దరించినట్లూ కాకతీయ కాలంనాటి బావులను నిర్మించడం కాపాడాలని కోరుతున్నారు.


Warangal: వరంగల్‌లో ఈ బావుల గురించి తెలుసా? పూర్తిగా తగ్గిన ప్రాభవం!

ఈ బావులన్నీ వందల సంవత్సరాలు తాగు, సాగునీరును కాలంతో సంబంధం లేకుండా నీటిని అందించాయి. ఈ బావులు పూర్తిగా భారీ రాతి కట్టడంతో నిర్మించారు. ఈ బావులన్నీ వాస్తు, ఏ కాలంలో నైనా నీరు ఉండే విధంగా జియాలజీ టెక్నాలజీ తో నిర్మించారు. చారిత్రక సంపదగా నిలిచిన బావుల్లో కొన్ని బావులు కనుమరుగు కాగా మరికొన్ని బావులు చెత్తతో నిండుతూ ఆనవాళ్లు లేకుండా పోవడానికి దగ్గరలో ఉన్నాయి. ఈ బావులన్ని సిటి పెరగడంతో అవాసాల మధ్య లోకి రావడంతో చెత్త కుండీలుగా మారుతున్నాయి. 

అయితే 2016, 2017, 2018 ల్లో మూడు సార్లు వరంగల్ ను హెరిటేజ్ సిటీగా ప్రకటించింది. దీంతో ఉదయ పథకం ద్వారా వరంగల్ కోట, చారిత్రక ఆలయాలు, చారిత్రక కట్టడాల అభివృద్ధికి సుమారు 59 కోట్ల నిధులను కేటాయించింది. వీటితోపాటు కాకతీయుల బావుల పరిరక్షణకు పూనుకోలేదు. ఒక్క మెట్ల బావిని మాత్రం కొంత అభివృద్ధి చేయగలిగారు. కానీ మిగతా బావులను కూడా కాపాడాలని చరిత్రకారులు, నగర ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget