By: ABP Desam | Updated at : 05 Jan 2023 05:37 PM (IST)
Edited By: jyothi
నాడు అదే ఆసుపత్రిలో పుట్టి , నేడు అక్కడే వైద్య సేవలందిస్తున్న రాజేశ్వరి!
Doctor Rajeshwari Special Story: మనం చదువుకున్న బడికే టీచర్ గా వెళ్లడమో, లేదో పెద్ద స్థాయికి చేరుకున్నాక ముఖ్య అతిథులుగా వెళ్లడమో చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇది అంతకు మించిన అనుభూతిని ఇచ్చే అరుదైన ఘటన. ఏంటంటారా.. ఓ అమ్మాయి పాతికేళ్ల కిందట ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టింది. ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా అదే ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందింది. ప్రస్తుతం అదే ఆసుపత్రికి వైద్యురాలుగా వెళ్లి ఎంతో మందికి మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఈ అరుదైన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది.
పుట్టిన ఆసుపత్రిలోనే డాక్టర్‌గా సేవలు
గత 25 సంవత్సరాల క్రితం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బానోత్ రాజేశ్వరి అనే అమ్మాయి జన్మించింది. ప్రస్తుతం అదే అమ్మాయి అక్కడి ఆసుపత్రిలోనే వైద్యురాలిగా సేవలు అందిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఇది నిజం. రాజేశ్వరి వైద్య విద్య పూర్తి చేసుకుని ప్రభుత్వ దవాఖానాలో ఉద్యోగం పొందారు. ఆమె పుట్టిన జనవరి నెలలోనే బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ప్రస్తుతం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ గోపాల్.. రాజేశ్వరికి బాల్యంలో వైద్యం చేశారు. ఇప్పుడు రాజేశ్వరి ఆయన వద్దే వైద్యురాలిగా చేరడం విశేషంగా మారింది. గీసుకొండ మండలం విశ్వనాథపురానికి చెందిన గిరిజన దంపతులు వాంకుడోతు రాజు, రమాదేవిలకు 1998 జనవరి 16న నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రాజేశ్వరి జన్మించారు.
వ్యవసాయ కుటుంబం నుంచి ఎదిగిన ఆమె ఇటీవల ప్రభుత్వం చేపట్టిన శాశ్వత నియామకాల్లో వైద్య విధాన పరిషత్ కు ఎంపిక అయ్యారు. ప్రతిభ ఆధారంగా నర్సంపేట సీహెచ్ సీ లో ఉద్యోగం పొందారు. రాజేశ్వరి భర్త బానోతు భరత్ ప్రస్తుతం అస్సాంలో ఓఎన్ జీ సీ లో పని చేస్తున్నారు. అయితే తాను పుట్టిన ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందించడం తనకు చాలా గర్వంగా ఉందని డాక్టర్ రాజేశ్వరి చెబుతున్నారు. తనలాంటి ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో తానెప్పుడూ ముందుంటానని ఆమె వివరిస్తున్నారు. తనలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన వారు, సర్కారు బడుల్లో చదువుకున్న వారు ఉన్నత స్థాయికి చేరుకొని.. ఇలాంటి అరుదైన, మదురమైన అనుభూతిని పొందాలని సూచిస్తున్నారు.
Minsiter Errabelli : బీఆర్ఎస్ నేత కన్నుమూత, పాడె మోసిన మంత్రి ఎర్రబెల్లి
Funds for Irrigation: స్వర్ణయుగంగా సాగురంగం, నీటిపారుదలకు రూ.26,885 కోట్లు: హరీశ్ రావు
Telangana Budget 2023 Live Updates: 2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్ 2023-24
Telangana Budget 2023 : నేడే తెలంగాణ బడ్జెట్- 3 లక్షల కోట్లు దాటిపోనున్న పద్దు!
YS Sharmila : కమీషన్ల కాళేశ్వరం కట్టారు, కాళోజీ కళాక్షేత్రం కట్టలేకపోయారు- వైఎస్ షర్మిల
Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?
Supreme Court Amaravati Case : ఫిబ్రవరి 23న సుప్రీంకోర్టులో అమరావతి కేసు విచారణ - త్వరగా చేపట్టాలని ఏపీ న్యాయవాది విజ్ఞప్తి !
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Top Mileage Bikes: మంచి మైలేజ్ ఇచ్చే బైక్స్ కొనాలనుకుంటున్నారా? - బడ్జెట్లో బెస్ట్ లుక్, బెస్ట్ మైలేజ్ వీటిలోనే!