అన్వేషించండి

Warangal News: కొత్తవాడ జంక్షన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం, మగ్గం ఏర్పాటుకు వరంగల్ మేయర్ ఆదేశాలు

స్మార్ట్ సిటీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ ఇంఛార్జ్ జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావిణ్యలు ఆదేశించారు.

స్మార్ట్ సిటీ పనుల శరవేగంగా పూర్తి చేయండి:  మేయర్ గుండు సుధారాణి , కలెక్టర్ ఇంచార్జ్ కమిషనర్ ప్రావిణ్య.

- కొత్తవాడ జంక్షన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం, మగ్గం ఏర్పాటుకు ఆదేశాలు..
- పనుల పురోగతిపై బల్దియా, ఇరిగేషన్, విద్యుత్, కుడా అధికారులు, గుత్తేదారులతో సమీక్ష

గ్రేటర్ వరంగల్ పరిధిలో స్మార్ట్ సిటీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి (Warangal Mayor Gundu Sudharani), కలెక్టర్ ఇంఛార్జ్ జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావిణ్యలు ఆదేశించారు. బుధవారం హన్మకొండ లోని కుడా మీటింగ్ హాల్ లో బల్దియా ఇరిగేషన్, విద్యుత్,  కూడా  అధికారులు గుత్తేదారులతో నగరంలో స్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న పనులపై సమీక్షించి నాణ్యతతో సకాలంలో పూర్తి చేయుటకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి, ఐఏఎస్ ప్రావిణ్య మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పథకం కింద 948.55 కోట్ల రూపాయలతో 66 అభివృద్ధి పనులను చేపట్టగా అందులో ఇప్పటికే 27 పనులు పూర్తయినాయని, మిగిలిన  వివిధ పురోగ దశలలో కొనసాగుతున్న 39 పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై వరకు పూర్తి చేసేలా అధికారులు, గుత్తేదారులు సమన్వయంతో కృషి  చేయాలన్నారు. జంక్షన్ల అభివృద్ధి లో భాగాంగా  కొత్తవాడ జంక్షన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ  విగ్రహం, మగ్గం ఉండే విధంగా అభివృద్ధి, సుందరికరణ చేయాలని వారు ఆదేశించారు.

వడ్డేపల్లి బండ్ అభివృద్ధి పనులు, భద్రకాళి బంద్ జోన్ డీ జోన్  ఈ పనుల పురోగతి, 5 గ్రాండ్ ఎంట్రెన్సులు, ఉర్స్ గుట్ట బండ్ అభివృద్ధి, ఎఫ్ ఎస్ టి పి, ఎస్ టి పి లు, ట్రాన్స్ఫర్ స్టేషన్లు, ల్యాండ్రో మార్ట్ లు, ఆర్1, నుండి ఆర్10 స్మార్ట్ సిటీ రోడ్లు, ఆర్ ఇ సి నుండి కేయుసి రోడ్డు వరకు, ఊర చెరువు గోపాల్పూర్ నుండి ప్రెసిడెంట్ పాఠశాల వరకు అండర్ గ్రౌండ్ డక్ట్ పనులు,   ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, తదితర కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కూలంకషంగా సమీక్షించి , వేగవంతంగా పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించాలని అన్నారు. 

రోడ్ల విస్తరణ, నాలలపై  కల్వర్టుల ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పనులలో అవరోధాలు ఏర్పడకుండా పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ లో లేకుండా బిల్లులు చెల్లిస్తున్నామని,  మెన్ అండ్ మెటీరియల్ను పెంచి నిర్ణిత గడువులోగా పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో కాంట్రాక్టర్ల బిల్లులలో కోత విధించడంతో పాటు జాప్యానికి పెనాల్టీలు వేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ సమీక్షలో బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, స్మార్ట్ సిటీ పీఎంసి ఆనంద్ ఓలేటి, సి హెచ్ ఓ శ్రీనివాసరావు, డిసిపి ప్రకాశ్ రెడ్డి, బల్దియా, కుడా, ఇరిగేషన్ ఈఈలు రాజయ్య సంజయ్ కుమార్,  భీం రావు, ఆంజనేయులు, బల్దియా, కుడా, ఇరిగేషన్, విద్యుత్, పట్టణ ప్రణాళిక అధికారులు, వివిధ ఏజెన్సీల గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
Breaking News:తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
తెలంగాణ ఫీజు రియింబర్స్‌మెంట్‌పై రేవంత్ కీలక ప్రకటన 
Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget