Warangal News: కడియం శ్రీహరి కుల వివాదమేంటి? కుమార్తె పెళ్లి ఇంకా పెద్ద రచ్చ ఎందుకు?
Telangana Elections 2024: కడియం శ్రీహరిని రాజకీయంగా దెబ్బకొట్టడానికి ఆయన కులం, కూతురు వివాహంపై మందకృష్ణ మాదిగ, తాటికొండ రాజయ్య ఆరోపణలు చేస్తున్నారు. ఇది జిల్లాలో వివాదంగా మారింది.
Kadiyam Srihari Cast Controversy: వరంగల్ రాజకీయాల్లో ముగ్గురి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇద్దరు రాజకీయ పార్టీ నేతలు కాగా.. మరొకరు ఉద్యమ నాయకుడు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిసి.. సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఆయన కూతురు కడియం కావ్యను టార్గెట్ చేశారు. పార్లమెంటు ఎన్నికల వేళ కడియం శ్రీహరి ని రాజకీయంగా దెబ్బకొట్టడానికి తండ్రి రిజర్వేషన్, కూతురు వివాహంపై మంద కృష్ణ మాదిగ, తాటికొండ రాజయ్య ఆరోపణలు చేస్తున్నారు. కావ్య వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉంది. వీరి ఆరోపణలు కావ్య ఓటమికి కారణమవుతాయా? కడియం శ్రీహరి రాజకీయ భవిష్యత్తును పెద్ద దెబ్బ కొడతాయా తెలుసుకుందాం.
వరంగల్ పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్ కావడంతో కడియం శ్రీహరి కూతురు కావ్య వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో అన్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా కడియం శ్రీహరి కులంపై రచ్చ జరుగుతుంది. కడియం శ్రీహరి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఎన్నికలు వచ్చినా ప్రతిసారి కడియం శ్రీహరిపై ఆరోపణలు వస్తాయి. ఇలా కడియం శ్రీహరి రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి కొనగుతుంది. కడియం ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు జయపజయాలు సాధారణం మయ్యాయి. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కుల ప్రస్తావనలు తీవ్రస్థాయికి వెళ్ళాయి.
ఉమ్మడి శత్రువు..
వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి, బీఅర్ఎస్, ఎమ్మార్పీఎస్ కు కడియం శ్రీహరి ఉమ్మడి శత్రువుగా మారారు. కడియం శ్రీహరి రాజకీయ చిరకాల ప్రత్యర్థి తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి శిష్యుడు బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ లు కడియం ను టార్గెట్ చేశాయి. వీరంతా కడియం శ్రీహరి ఎస్సీ కాదని తండ్రి ఎస్సీ కానప్పుడు కూతురు ఎలా ఎస్సీ అవుతుందని ఆరోపణలు చేస్తున్నారు. వీరి ఆరోపణలకు కడియం శ్రీహరి సైతం కౌంటర్ ఇస్తున్నారు. ఎస్సీ అని చెప్పుకుంటూ మాదిగలను మోసం చేస్తున్న కడియం శ్రీహరి ఆయన కులం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలు కాస్త వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లాయి. నిత్యం మీడియా ముందు ఈ ముగ్గురు నేతలు కడియం శ్రీహరిని విమర్శిస్తున్నారు.
కడియం కావ్య వివాహంపై ఆరోపణలు..
కడియం కావ్యను తన వారసురాలిగా రావడం కోసం బీఅర్ఎస్ పార్టీ నుండి వరంగల్ ఎంపీ టిక్కెట్ ఇప్పించుకొన్నారు శ్రీహరి. రాజకీయ పరిణామాలు దృష్ట్యా కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కాంగ్రెస్ లో చేరి ఇక్కడ కూడా కూతురు కు టిక్కెట్ ఇప్పించుకోవడంతో కడియం శ్రీహరిపై ముప్పేట విమర్శలు పెరిగాయి. కడియం శ్రీహరి కులంతో పాటు కూతురు ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడంతో ఇద్దరిపై మంద కృష్ణ మాదిగ, తాటికొండ రాజయ్య, అడపాదడపా ఆరూరి రమేష్ లు ఆరోపణల దాడి చేస్తున్నారు. కావ్య ముస్లిం యువకుణ్ని వివాహం చేసుకోవడంతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారా? ముస్లిం పద్ధతిలోనా? హిందూ పద్ధతిలోనా? ఏ పద్ధతిలో పెళ్లి చేసుకుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలు రాజకీయంగా కొంత కల్లోలాన్ని రేపుతున్నాయి.
కావ్య గెలుపోటములపై ప్రభావం చూపేనా...?
కడియం కావ్య గెలుపోటములపై ప్రత్యర్థుల ఆరోపణలు పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని విశ్లేషకుల అంచనా. కడియం శ్రీహరి కులంపై ఇరవై ఏళ్లుగా ఆరోపణలతో ఇన్ని రోజులు కడియంకు వచ్చిన నష్టం లేదు. ఇక కూతురు కొత్తగా రాజకీయాల్లోకి రావడం ఆమె వివాహంపై ఆరోపణలు వెల్లువెత్తడంతో జరుగుతుంది. భారత దేశంలో ఎవరు ఎవరిని వివాహం చేసుకున్న చిన్ననాటి నుండి సర్టిఫికేట్ ప్రకారం ఏ కులం వస్తుందో అదే వర్తిస్తుంది. అయితే కావ్య ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. కాబట్టి ముస్లిం పద్ధతిలో నిఖా చేసుకుంటే ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని మందకృష్ణ ఆరోపణ.
కడియం శ్రీహరి మాదిగలకు అన్యాయం చేశాడని, కావ్య ముస్లిం అని మంద కృష్ణ, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్ లు ఆరోపణలు చేసిన గెలుపు ఓటములపై ప్రభావం చూపదని విశ్లేషకుల వాదన. పార్టీల బలాబలాలు చూస్తారు. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి ఆరోపణలు పరిగణలోకి రావు. ఓటర్ల పై పెద్ద ప్రభావం చూపకపోవచ్చు. అంతేకాదు భారత దేశంలో మహిళల పట్ల గౌరవం ఉంటుంది. కావ్య విషయంలో ఈ భావన ఉన్నా పెద్దగా ఓటింగ్ లో నష్టం ఉండకపోవచ్చనే వాదన లేకపోలేదు.
పార్టీ ముఖ్యం..
గెలుపు అవకాశాలకు పార్టీ ముఖ్యం. అందుకే బలహీనంగా ఉన్న బీఅర్ఎస్ నుండి పోటీ చేసి ఓడిపోవడం కంటే.. బలంగా ఉన్న పార్టీ అవసరం కాబట్టి. కడియం శ్రీహరి, కావ్య బీఅర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరి పోటీ చేయడం జరుగుతుందని చెప్పవచ్చు. చదువుకోని ఓటర్లు పార్టీని చూస్తారు.. విద్యావంతులు, పార్టీతో పాటు అభ్యర్థిని చూస్తారు.