News
News
వీడియోలు ఆటలు
X

Warangal CP Ranganath: అర్ధరాత్రి డీజే మోగిస్తే కఠిన చర్యలు, పైరవీలు కుదరవు - వరంగల్ సీపీ స్ట్రాంగ్ వార్నింగ్

అర్ధరాత్రి సమయాల్లో డీజే సెట్లు, బ్యాండ్ ను ఉపయోగిస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు.

FOLLOW US: 
Share:

Warangal CP Ranganath said strict action will be taken if DJs play at midnight: 
వరంగల్: అర్ధరాత్రి సమయాల్లో ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా డీజే సెట్లు, బ్యాండ్ ను ఉపయోగిస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో అర్ధరాత్రి సమయాల్లో పెళ్ళి ఉరేగింపు, ఇతర ఫంక్షన్ల పేరుతో ఏర్పాటు చేస్తున్న డీ.జే సెట్ తో పాటు బ్యాండ్ వాయిద్యాల వినియోగం అధికంకావడంతో పాటు అధిక శబ్ధాల కారణంగా ప్రజలతో పాటు వ్యాధిగ్రస్తులు ఇబ్బందులకు గురౌవుతున్నారు. అర్థరాత్రి వేళల్లో 100 డయల్ ద్వారా ఫిర్యాదుల సంఖ్య అధికం కావడంతో ఈ సమస్యపై వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రత్యేక చర్యలకై పోలీస్ కమిషనర్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా వరంగల్, హనుమకొండ జిల్లాలోని డి.జె, బ్యాండ్ వాయిద్యకారులు, ఆర్కెస్ట్రా బృందాలతో పోలీస్ కమిషన పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా డి.జే. బ్యాండ్ (DJ Sound) వాయిద్యకారులు, ఆర్కెస్టాలు యజమానులతో ముచ్చటించారు. అనంతరం పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ర్ధరాతి సమయాల్లో డీ.జే వినియోగించడం ద్వారా ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌవుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. దాంతో ఇకపై డీజే ఇతర వాయిద్య బృందాలు వారు సైతం తప్పని సరిగా సమయపాలన పాటించాల్సి ఉంటుందని.. సుప్రీం కోర్టు మార్గదర్శక సూత్రాలను అనుసరించి రాత్రి పది తరువాత ఎలాంటి సౌండ్ బాక్సు వినియోగించడం, వాయిద్యాలను ఉపయోగించరాదు అన్నారు. వరంగల్ సీపీగా వెళ్లినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ లో తనదైన మార్క్ చూపిస్తున్న ఏవీ రంగనాథ్, సామాన్య ప్రజలకు సైతం ఇబ్బంది లేకుండా చూసేందకు చర్యలు తీసుకుంటున్నారు.

వీటిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల స్థితిగుతులను దృష్టిలో వుంచుకోని రాత్రి 12 గంటల లోపు శుభకార్యములకు, ఉరేగింపులకు డీ.జీ, బ్యాండ్ వాయిద్యకారులు, ఆర్కెస్ట్రాలు వినియోగించుకోనేందుకు వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. ఇచ్చిన గురువు అనంతరం ఒక్క నిమిషం ఆలస్యం అయిన డీ.జే. సామాను, ఇందుకోసం వినియోగిస్తున్న వాహనం సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో పాటు, డీజే యాజమాని, డీజే వినియోగించుకుంటున్న వ్యక్తులపై పోలీస్ కేసులు నమోదు చేస్తామని సీపీ రంగనాత్ హెచ్చరించారు. ఇదే రీతిలో ఇతర వాయిద్య బృందాలకు కూడా వర్తిస్తుందని, అలాగే డీజే వినియోగం కోసం చేసే పైరవీలకు తావు లేదన్నారు. 

ముఖ్యంగా శుభకార్యాలకు డీజే, బ్యాండ్ వాయిద్యాలు వినియోగించుకోనే వ్యక్తులకు ముందస్తుగానే పోలీసులు నిబంధనలను తెలియపర్చాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. అలాగే ఎవరైన శబ్దకాలుష్యానికి గురిచేస్తూ డీజే వినియోగిస్తున్నట్లయితే తక్షణమే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో డిసిపిలు అబ్దుల్బారీ, కరుణాకర్, స్పెషల్ బ్రాంచ్ ఎసిపి తిరుమల్, ఇన్ స్పెక్టర్లు. సతీష్ బాబు, రాంబాబుతో పాటు సెంట్రల్, ఈస్ట్ జోన్ పరిధిలోని ఇన్ స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు.

Published at : 16 May 2023 10:30 PM (IST) Tags: Telugu News Warangal Marriage AV Ranganath DJ

సంబంధిత కథనాలు

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

TS PGECET Results: తెలంగాణ పీజీఈసెట్‌ - 2023 ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే!

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో జై బాలయ్య మేనియా- మహబూబ్‌నగర్‌ టూర్‌లో కేటీఆర్

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఎందుకీ గడ్డుకాలం, తొలిరోజు పైచేయి సాధించిన ఆస్ట్రేలియ జట్టు

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

Skill Based Courses: 'నైపుణ్య' డిగ్రీ కోర్సులకు ముందుకు రాని కళాశాలలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

తెలంగాణ రాజకీయాల్లో ‘ధరణి’ దుమారం- తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు!

టాప్ స్టోరీస్

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

Kottu Satyanarayana: మనం చేసిన యాగం వల్లే కేంద్రం మనకి నిధులిచ్చింది - మంత్రి కొట్టు వ్యాఖ్యలు

YS Viveka Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ - అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్ !

YS Viveka  Case : వివేకా కేసులో సీబీఐ అప్ డేట్ -  అవినాష్ రెడ్డి A-8 నిందితుడని కోర్టులో కౌంటర్  !

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్

KTR: యువత స్కిల్ సంపాదించాలి, ఉద్యోగం దానికదే వస్తుంది - కేటీఆర్