News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!

పౌరులకు అత్యవసర పరిస్థితిలో సాయం చేసిన ఓ కానిస్టేబుల్, హోంగార్డును వరంగల్ సీపీ సత్కరించారు.

FOLLOW US: 
Share:

వరంగల్ జిల్లాలో సీపీఆర్ ప్రక్రియతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన హోంగార్డును వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఘనంగా సత్కరించారు. నిన్నటి రోజున (మే 28) కాపువాడకు చెందిన రేషన్ డీలర్ రాజు వరంగల్ నుండి ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఉన్నట్టుండి ములుగు జంక్షన్ వద్ద ఆయనకు గుండె పోటు రావడంతో రోడ్డు మీద పడిపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ఉన్నవారు మనకెందుకులే అనుకుని అటుగా వేళేవారు చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారు. కానీ అదే సమయంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వావిలాల స్వామిరాజు రోడ్డుపై గుండె నొప్పితో పడిపోయిన వ్యక్తిని గమనించారు. చుట్టు ప్రక్కల వారి సాయంతో రోడ్డు పక్కకు తీసుకువెళ్ళి సదరు వ్యక్తికి వచ్చిన లక్షణాలు గుండెపోటుగా గ్రహించాడు. 

హోంగార్డు రాజు ఇటీవల పోలీసు కమిషనరేట్లో సీపీఆర్ (కార్డియో పల్మనరీ రెసుసిటేషన్) పద్ధతిని నేర్చుకుని ఉండడంతో, ఇదే పద్ధతిని అనుసరించి స్వామి క్రింద పడిపోయిన వ్యక్తిపై సీపీఆర్ పద్ధతిని ఛాతీపై అమలు చేయడంతో సదరు వ్యక్తికి కాసేపటికి స్పృహలో వచ్చింది. వెంటనే ఆ వ్యక్తిని ఆటోలో ఎక్కించి ఎం.జీ.యంకు సకాలంలో తరలించారు. దీంతో రేషన్ డీలర్ రాజు ప్రాణపాయ స్థితి నుండి బయటపడటం జరిగింది. ఒక వ్యక్తిని సీపీఆర్ ప్రక్రియతో ప్రాణాలు కాపాడినందుకుగాను ఈరోజు నిట్ ప్రాంగణంలో ఏర్పాటు పోలీస్ అధికారులతో ఏర్పాటు సమావేశంలో హోంగార్డు స్వామి పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి నగదు బహుమతిని అందజేశారు.

మరో సంఘటనలో

చిల్పూరు మండలంలోని గార్లగడ్డ తండా గ్రామ పంచాయితీ పరిధిలోని మల్లన్నగండి రిజర్వాయర్లో శనివారం రోజు గల్లంతైన యువకుడిని రక్షించేందుకు కానిస్టేబుల్ చొరవ చూపారు. అప్పటివరకు రిజర్వాయర్ నీటిలోకి దిగేందుకు ఎవరూ సాహసించలేదు. కాని కానిస్టేబుల్ వీరన్న ధైర్యం చేసి యువకుడు మునిగిన చోట దూకి యువకుడు శేకర్ ను బయటకు తీసుకువచ్చాడు. కానీ, అప్పటికే శేఖర్ మృతి చెందాడు. నీట మునిగిన యువకుడిని కాపాడేందుకు ధైర్యం చేసిన కానిస్టేబుల్ వీరన్నను కూడా పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించి నగదు రివార్డు అందజేశారు.

ఈ కార్యక్రమములో క్రైం డీసీపీ మురళీధర్, సెంట్రల్, ఈస్ట్ జోన్ డీసీపీలు అబ్దుల్ బారీ, కరుణాకర్, అదనపు డీసీపీ పుష్పా, సంజీవ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కుమార్, ట్రైనీ ఐపీఎస్ అంకిత్, ఏసీపీలు మధుసూధన్, రఘునందన్ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌లో లింగ నిర్ధారణ పరీక్షలు వెలుగులోకి

వరంగల్ జిల్లా కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ ప్రాంతం వెంకటేశ్వర కాలనీలో ఎలాంటి వైద్య విద్య అర్హతలు లేకుండానే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆపై అవసరమైన వారికి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన 18 మంది నిందితులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్సు యూసీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం ఊళ్లో ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి మూడు లింగ నిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్ ఫోన్లు, 73వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డా. బలె పార్ధు, డా. మోరం అరవింద, డా. మోరం శ్రీనివాస్ మూర్తి, డా. బాల్న పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్, డి. ప్రణయ్ బాబు, కీర్తి మోహన్, బాల్నె అశలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్ ఉన్నారు. అలాగే మరికొంత  మంది నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను వెల్లడించారు. 

Also Read: వరంగల్ పోలీసుల స్టింగ్ ఆపరేషన్- లింగనిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు చేసే ముఠా గుట్టు రట్టు

Published at : 29 May 2023 07:09 PM (IST) Tags: Warangal CP Warangal Police AV Ranganath home guard CPR Process

ఇవి కూడా చూడండి

TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

TOSS Exams: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూలు విడుదల - పరీక్షల టైమ్ టేబుల్ ఇదే!

TREIRB: గురుకుల అభ్యర్థులకు 'ఆప్షన్ల' నమోదు తప్పనిసరి, నియామక బోర్డు కీలక సూచన

TREIRB: గురుకుల అభ్యర్థులకు 'ఆప్షన్ల' నమోదు తప్పనిసరి, నియామక బోర్డు కీలక సూచన

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య

Breaking News Live Telugu Updates: కడియం శ్రీహరికి జై కొట్టిన తాటికొండ రాజయ్య

TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

TS ICET: ఐసెట్ చివరివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం - అందుబాటులో 10,762 సీట్లు

టాప్ స్టోరీస్

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279