అన్వేషించండి

Warangal News: వరంగల్ పోలీసుల స్టింగ్ ఆపరేషన్- లింగనిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు చేసే ముఠా గుట్టు రట్టు

Warangal News: అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆపై గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Warangal News: వరంగల్ జిల్లా కేయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ ప్రాంతం వెంకటేశ్వర కాలనీలో ఎలాంటి వైద్య విద్య అర్హతలు లేకుండానే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఆపై అవసరమైన వారికి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన 18 మంది నిందితులను యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్సు యూసీ పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం ఊళ్లో ఉన్నట్లు గుర్తించారు. వీరి వద్ద నుంచి మూడు లింగ నిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్ ఫోన్లు, 73వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డా. బలె పార్ధు, డా. మోరం అరవింద, డా. మోరం శ్రీనివాస్ మూర్తి, డా. బాల్న పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్, డి. ప్రణయ్ బాబు, కీర్తి మోహన్, బాల్నె అశలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత, బండి నాగరాజు, కాసిరాజు దిలీప్ ఉన్నారు. అలాగే మరికొంత  మంది నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గుర్తించారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ వివరాలను వెల్లడించారు. 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగ నిర్ధారణకు పాల్పడుతూ పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకొని.. అడపిల్ల పుడుతున్నట్లు తెలిస్తే గర్భస్రావానికి పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయని.. ఈక్రమంలోనే యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్స్, జిల్లా వైద్య విభాగాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టామని సీపీ తెలిపారు. పోలీసులు ఆపరేషన్ దేశాయ్ నిర్వహించి అక్రమంగా లింగనిర్ధారణ పాల్పడుతున్నట్లుగా గుర్తించారన్నారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లోని ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్ గతలో స్కానింగ్ కేంద్రంలో టెక్నిషియన్ గా పనిచేశాడని.. ఆ సమయంలోనే ఆక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసినందుకు గాను పోలీసులు అతడిని అరెస్ట్ చేశారన్నారు. అయినా అతడు బుద్ధి మార్చుకోకుండా మరోసారి అక్రమ మార్గంలో డబ్బు సంపాధించేందుకు ప్లాన్ వేశాడన్నారు. ఇందుకోసం తన భార్య సంధ్యారాణితో కలిసి కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ ప్రాంతంలోని వెంకటేశ్వర కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని గర్భవతులకు లింగనిర్ధారణ చేసేందుకు కొద్ది సిబ్బందితో పోర్టబుల్ స్కానర్ల సహాయంతో స్కానింగ్ కేంద్రాన్ని రహస్యంగా నిర్వహిస్తున్నారు. నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్ఎంపీలు, పీఆర్ఓలు, ఆసుపత్రి మేనేజ్ మెంట్ సిబ్బంది, వైద్యులతో కలిసి ఓ నెట్ వర్స్ గా మారి అక్రమంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసేవారని సీపీ ఏవీ రంగనాథ్ వివరించారు. 

ఆడబిడ్డ పుడుతుందని తెలిస్తే గర్భస్రావం చేయించుకోవాలనుకునే వాళ్లను హన్మకొండలోని లోటస్ హస్పటల్, గాయత్రి హస్పటల్, నెక్కొండలోని ఉపేందర్ ( పార్థు)హాస్పటల్, నర్సంపేట్ లోని బాలాజీ మల్టీ స్పెషాల్టీ హస్పటళ్లలో గర్భవతులకు సంబంధిత ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది అక్రమంగా గర్భస్రావాలను చేసేవారు. ఇందుకోసం బాధితుల నుండి ఫీజుల రూపంలో వసూళ్లు చేసిన డబ్బులను ఈ ముఠా సభ్యులు కమీషన్ల రూపంలో వాటాలు పంచుకునేవారు. ఒక్కోక్క గర్భస్రావానికి 20 వేల నుంచి 30వేల రూపాయల వరకు డబ్బులు వసూలు చేసేవారు. ఇప్పటి వరకు ఈ ముఠా వందకు పైగా గర్భస్రావాలకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారని వరంగల్ సీపీ వెల్లడించారు. ఈ ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీ పుష్ప, టాస్క్ ఫోర్స్ వీసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్లు సుజాత, శ్రీనివాస్ రావు, జనార్ధన్ రెడ్డి, వినయ్ కుమార్, ఎస్.ఐలు ఫసీయుద్దీన్, మల్లేశం, శరత్ కుమార్, ఏ.ఏ.ఓ సల్మాన్ప, ఏ.హెచ్.టి.యు సిబ్బంది ఎ.ఎస్.ఐ భాగ్యలక్ష్మి, హెడా రానిస్టేబుల్ సమీయుద్దీన్, కానిస్టేబుళ్ళు శ్రీనివాస్, సైబర్ క్రైం సిబ్బంది కిషోర్ కుమార్, రాజు, అంజనేయులు, రజియా సుల్తానా, టాస్క్ఫోర్స్ సిబ్బంది. శ్యాంసుందర్, సురేష్, ప్రభాకర్, కమల వనంత, హోంగార్డ్ రవీందర్, చైల్డ్ కోఆర్టినేటర్లు కృష్ణమూర్తి, కృతిలను సీపీ అభినందించారు.

టాప్ హెడ్ లైన్స్

Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
Embed widget