అన్వేషించండి

హోమ్ గార్డ్‌ కొడుకు నీట్ ర్యాంకర్- పిలిచి అభినందించిన వరంగల్ సీపీ

హోంగార్డు కొడుకుని తన ఆఫీసుకి పిలిచి మరీ అభినందించిన వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి

పుత్రోత్సాహంబు తండ్రికి పుత్రుడు జనియించగా... అని సుమతీకారుడు ఎప్పుడో కుమారుడి విజయంపై తండ్రి ఏ రకంగా ఫీల్ అవుతారనే విషయం చాలా స్పష్టంగా ఈ పద్యంలో చెప్పారు. కొడుకు పుట్టగానే కాదు అతడు ప్రయోజకుడు అయినప్పుడే ఆ తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని ఆ పద్యం సారాంశం. అలాంటి విజయాన్ని తన తండ్రికి అందించాడు ఓ కుమారుడు.  

ఇటీవల ప్రకటించిన నీట్‌లో రాణించిన హోంగార్డ్ కుమారుడిని వరంగల్ పోలీస్ కమిషనర్  తరుణ్ జోషి బుధవారం అభినందించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న మార్గం శ్యాం కుమారుడు మార్గం మణికంఠ ఇటీవల ప్రకటించిన నీట్‌ ఫలితాల్లో 720 మార్కులకు గాను 646 మార్కులు సాధించాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో తనకంటూ ఒక సీటును గ్యారేంటీ చేసుకున్నాడు. 

తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో చిన్న స్థాయి ఉద్యోగం చేస్తూ తనపై ఉంచిన నమ్మకంతో ఎంతో కష్టపడి చదివాడు మణికంఠ. అద్భుతమైన ప్రతిభతో నీట్‌లో మెరిశాడు. ఈ సందర్భంగా వరంగల్ నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి హోంగార్డ్ కుమారుడు మణికంఠను కమిషనరేట్ కార్యాలయంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పుష్పాగుచ్చం అందజేసి అభినందించారు. స్వీట్ తినిపించారు. హోంగార్డ్ శ్యాంను కూడా పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు. 

తమ బాస్ స్వయంగా కొడుకుని అభినందించడం చూసిన ఆ తండ్రి ఆనందానికి అవధులు లేవు. తమ అబ్బాయి సాధించిన ర్యాంకుతో డిపార్టుమెంటులోనూ గుర్తింపు రావడం సంతోషంగా ఉందన్నారు హోంగార్డ్ మార్గం శ్యామ్. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిరంతరం విధుల్లో బీజీగా ఉన్నా తమ పిల్లల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న పోలీస్ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పోటీ పరీక్షలతోపాటు అన్ని రంగాల్లో పోలీస్ పిల్లలు రాణించడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. నీట్, జె.ఈ. ఈ అడ్వాస్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బంది పిల్లలందరికి పోలీస్ కమిషనర్ అభినందనలు తెలియజేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా భవిష్యత్తులోనూ పోలీసు సిబ్బంది పిల్లలు క్రమశిక్షణతో ఇలాంటి విజయాలు సాధించి డిపార్ట్మెంట్‌కి పేరు తెస్తారని ఆశిస్తున్నానని తెలిపారు 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Harish Rao: మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
మంత్రి మాట నమ్మి రైతులు మోసపోయారు, మీకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు: హరీష్ రావు
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Shivani Nagaram: శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
శారీలో శివానీ నాగారం... సముద్ర తీరంలో అందాల భామ హొయలు
Embed widget