By: ABP Desam | Updated at : 23 Apr 2023 02:36 PM (IST)
Edited By: jyothi
సెల్ ఫోన్ పోయిందా - అయితే వెంటనే ఇలా చేయండి: వరంగల్ సీపీ ( Image Source : ABP Reporter )
Warangal News: మీ సెల్ ఫోన్ పోయిందా.. అయితే టెన్షన్ పడకండి.. వెంటనే సీఈఐఆర్ అనే పోర్టల్ లోకి లాగిన్ అయి కొన్ని వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలకు భరోసా కల్పిస్తూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరి చేతిలో ఫొన్ ఉంటోంది. ఒక్కోసారి ఫోన్ కనిపించకపోయినా, ఎక్కడైనా పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా.. తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఈ సమస్యను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్). సెల్ ఫోన్ పోయిన వెంటనే సీఈఐఆర్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు నమోదు చేస్తే.. వీలైనంత తొందరగా ఫోన్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.
సీఈఐఆర్ లో ఎలా నమోదు చేసుకోవాలి?
కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశ పెట్టిన ఈ సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మొబైల్ ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. www.ceir.gov.in అనే వెబ్ సైట్ లో లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్/ స్టోలెన్ అనే లింక్ పై క్లిక్ చేసి, సెల్ ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్ లోడ్ చేయాలి. దీంతో పాటు ఏ రోజు, ఎక్కడ పోయింది, రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా.. పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఏ కంపెనీ మొబైల్ అయినా సీఈఐఆర్ విధానం 24 గంటల్లోపు ఫోన్ పని చేయకుండా చేస్తుంది. సెల్ ఫోన్ దొరికిన తర్వాత వినియోగదారుడు అదే వెబ్ సైట్ లోకి వెళ్లి అక్/ ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేసి.. ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
సీఈఐఆర్ వెబ్సైట్ పై అవగాహన కార్యక్రమాలు..
సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం... సీపీ రంగనాథ్ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నారు. సెల్ ఫోన్ వాడుతున్న ప్రతీ ఒక్కరికి సీఐఈఆర్ గురించి తెలిసేలా పోలీస్ స్టేషన్, సర్కిల్ పరిధిలో, డివిజన్ పరిధిలో బ్లూ కోర్ట్స్, పెట్రో కార్ సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. మొబైల్ పోయిన వెంటనే తమ పరిధిలోని పోలీసులకు సమాచారం అందించి సీఈ ఐఆర్ అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని సీపీ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం కోసం అవసరమయిన పోస్టర్లు, వీడియోను విడుదల చేశారు.
Warangal CP: హోంగార్డుకు వరంగల్ సీపీ సత్కారం, అతను చేసిన పనికి సీపీ ఫిదా!
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
Errabelli Dayakar Rao: త్వరలో బీసీ కుల వృత్తుల వారికి రూ.1లక్ష చొప్పున ఆర్థిక సహకారం: మంత్రి ఎర్రబెల్లి
IIIT Hyderabad: హెచ్ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్, ట్రిపుల్ఐటీ హైదరాబాద్లో ప్రవేశాలు!
Warangal News: వరంగల్ పోలీసుల స్టింగ్ ఆపరేషన్- లింగనిర్ధారణ పరీక్షలు, గర్భస్రావాలు చేసే ముఠా గుట్టు రట్టు
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్కే మొగ్గు చూపిన ధోని!
AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా