Gauravelli Project: గౌరవెల్లి ప్రాజెక్ట్‌పై మంత్రి పొన్నం బిగ్ అప్‌డేట్ - పనుల జాతరలో భాగంగా హనుమకొండలో పర్యటన
Hanmakonda Latest News: గౌరవెల్లి ప్రాజెక్టును ప్రాధాన్య క్రమంలో వ్యక్తిగతంగా తీసుకొని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పనుల జాతరలో భాగంగా హన్మకొండలో పర్యటించారు.

Ponnnam PraBhakar On Gauravelli Project: హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాక్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ పెండింగ్‌లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టుపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆ ప్రాంత ప్రజలకు గుండెకాయలాంటి ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తాను తీసుకుంటానని పేర్కొన్నారు. అంతకు ముందు పలు పనులకు శంకుస్థాపనలు చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా రెండో విడత పనుల జాతర కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షకుపైగా పనులు ప్రారంభించబోతున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పనులు ప్రారంభించారు. ఇప్పటికే పూర్తి అయిన భవనాలు ప్రారంభించారు.
ముందుగా భీమదేవరపల్లి మండలం మల్లారం గ్రామంలో 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం వీర్లగడ్డ తండాలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్లకు,గ్రామ ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు..
అక్కడే ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పొన్నం ప్రభాకర్..."తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క "పనుల జాతర" అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 46 పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశాం. గ్రామ పంచాయతీలు, అంగన్వాడీలు, రోడ్లు గ్రామీణ ప్రాంతాల సమస్యలు పరిష్కరిస్తున్నాం" అని అన్నారు.
భవిషత్‌లో గ్రామాల్లో పూర్తిగా ప్రజాసమస్యలు తొలగిపోయేలా చేస్తున్నామని మంత్రి పొన్నం వెల్లడించారు. పనుల జాతర పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అయినవి..శాంక్షన్ అయి పనులు, ప్రారంభంకాని వాటికి శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు. గ్రామాల్లో వైద్యపరంగా, వ్యవసాయపరంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా గౌరవెల్లి ప్రాజెక్టు అంశంపై స్పందించారు. ఈ ప్రాంత ప్రజలకు గుండెకాయ లాంటిదని అభిప్రాయపడ్డారు. "ప్రాజెక్ట్ భూసేకరణ జరుగుతుంది. కాలువల నిర్మాణాల పనులు ప్రారంభం అవుతాయి. కాలువలు తవ్వితే వ్యవసాయానికి నీళ్లు అందించడమే కాకుండా రైతుల ఆదాయం పెరుగుతుంది. త్వరలో ప్రాజెక్ట్ పూర్తవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి,ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన వెంట ఉండి నడిపిస్తున్నారు." అని అన్నారు.
హనుమకొండ జిల్లాలో భూసేకరణ కోసం 25 కోట్లు కేటాయించామని తెలిపారు మంత్రి. కరీంనగర్, సిద్దిపేట జిల్లాకి కూడా డబ్బులు కేటాయిస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడం తన బాధ్యతని చెప్పుకొచ్చారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రారంభించారని ఇవాళ తాను నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తున్నామని గుర్తు చేశారు. ఎన్జీటీ వేసిన కేసుకి సంబంధించి 10 కోట్లు రూపాయలు ప్రభుత్వం చెల్లించిందని... భూసేకరణపై రెవెన్యూ వ్యవస్థ పని చేస్తుందన్నారు."
గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి హనుమకొండ రైతాంగానికి నీళ్ళు అందిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేవాదుల ద్వారా భీమదేవరపల్లి,ఎల్కతుర్తి మండలాలకు, చిగురు మామిడి,సైదాపూర్ మండలాలకు వరద కాలువ ద్వారా నీళ్ళు అందిస్తున్నామన్నార.
మంత్రి పొన్నం ఎరువుల కొరతపై మాట్లాడారు. "విత్తనాల ,విద్యుత్ బాధ్యత మాది.. ఎరువులు కేంద్రం చేతిలో ఉంటుంది. ఎరువులు ఇప్పించాల్సిన బీజేపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుంది. రైతులను రెచ్చగొట్టే విధంగా బీఆర్‌ఎస్ వ్యవహరిస్తుంది. ఎరువులకు సంబంధించి సమస్య పరిష్కారం చేస్తున్నాం. కేంద్రం సహకరించాలి. ఎరువులు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయవు. కేంద్రం చేతిలో ఉంది. ఎరువులు ఇవ్వండి లేదా తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలి" అని పొన్నం డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లపై కామారెడ్డి డిక్లరేషన్ నుంచి కుల గణన కోసం లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించారని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆ లెక్కలు సబ్ కమిటీ ద్వారా ఆమోదించుకొని కేబినెట్ ఆమోదం చేసుకొని శాసనసభలో ఆమోదం చేసుకున్నామన్నారు. శాసన సభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ చట్టం చేసి గవర్నర్‌కు అక్కడి నుంచి రాష్ట్రపతికి పంపినట్టు తెలిపారు.
"కేంద్రంలో ఆ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షలకు అనుగుణంగా రిజర్వేషన్లు చేయాలి. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థల రిజర్వేషన్లు అడగడం లేదు. స్థానిక సంస్థలు విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చేయాలి. కేంద్రం రిజర్వేషన్లకు మోకాలు అడ్డుతుంది. ముస్లింల పేరుతో బీజేపీ రిజర్వేషన్లు అడ్డుకుంటుంది. పేద ముస్లింలు దూదేకుల కాశీం కులాలు బీసీలో 70 సంవత్సరాలుగా ఉన్నాయి. కొత్తగా ఇచ్చేది ఏం లేదు. శాసన సభలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది. ఇప్పుడు అడ్డుకుంటున్నారు. మేము 42 శాతం రిజర్వేషన్లుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం. తెలంగాణ స్పూర్తితో జేఎసి గా ఏర్పడి రాష్ట్రాన్ని సాధించుకున్న విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి రిజర్వేషన్లు సాధించుకోవాలి. పారదర్శకంగా గ్రామాల్లో సమాచారాన్ని సేకరించడం, ఎంపైరికల్ డేటా ఉంది. రిజర్వేషన్లకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా" అని అన్నారు.





















