అన్వేషించండి

BRS News : కడియంపై ఇక విమర్శలు చేయను - కేటీఆర్‌తో భేటీ తర్వాత రాజయ్య ప్రకటన !

కడియం శ్రీహరిపై ఇక విమర్శలు చేయనని రాజయ్య ప్రకటించారు. కేటీఆర్ ప్రగతి భవన్ కు పిలిపించి మందలించడంతో ఆయనిలా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.

 

BRS News :  భారత రాష్ట్ర సమితిలో పెరుగుతున్న అసంతృప్తి స్వరాలను కట్టడి చేసేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు.  స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ పరిధిలో సీనియర్‌ నేతల నడుమ జరుగుతున్న మాటల యుద్ధానికి తెరదించారు. కడియం శ్రీహరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజయ్యను కేటీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించారు. ప్రగతి భవన్‌లో తాటికొండ రాజయ్యతో కేటీఆర్‌ మాట్లాడారు. కడియం శ్రీహరిపై చేస్తున్న ఆరోపణలు,  వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసినట్లుగా ససమాచారం. కడియం బహిరంగంగా పెద్దగా విమర్శలు చేయనప్పటికీ ఎందుకు పార్టీకి నష్టం జరిగేలా మాట్లాడుతున్నారని రాజయ్యను కేటీఆర్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.                             

గత కొంతకాలంగా రాజయ్య వర్సెస్‌ కడియం మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. రాజకీయపరంగానే కాదు.. వ్యక్తిగత విమర్శలూ ఇందులో చోటు చేసుకుంటున్నాయి.  ఈ తరుణంలో పార్టీ పరువును బజారుకీడ్చడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. పరిస్థితి చక్కదిద్దాలని కేటీఆర్ ను ఆదేశించారు.  ఈ సందర్భంలో రాజయ్యను మందలించిన కేటీఆర్ .. ఇంకోసారి అలాంటి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లుగా చెబుతున్నారు.  పార్టీ లైన్‌ దాటి మాట్లాడకూదని, ఎవరూ ఆ పని చేసినా సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.                     

”ఇద్దరి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది. ఇంతటితో ఈ వివాదం ముగించాలని, ఎన్నికల సమయం దగ్గరపడుతోంది కాబట్టి ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని.. లేకుంటే తీవ​ పరిణామాలు ఉంటాయ”ని కేటీఆర్‌ రాజయ్యను హెచ్చరించినట్లు సమాచారం.  ఆయన కడియంతోనూ భేటీ కావొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేటీఆర్‌ను  క‌ల‌సిన అనంత‌రం రాజ‌య్య మీడియాతో మాట్లాడుతూ, కడియం శ్రీహరిని కించపర్చేలా వ్యాఖ్యలు చేయలేదని కేటీఆర్ కు వివరించాన్నారు. కడియం శ్రీహరి తల్లిని అవమానించేలా తాను వ్యాఖ్యలు చేయలేదని రాజయ్య తెలిపారు. 

 కడియం శ్రీహరి అహంతో ప్రతి రోజూ తనపై విమర్శలు చేస్తుంటారన్నారు. ఈ విషయాలన్నీ తాను కేటీఆర్ దృష్టికి తీసుకు వచ్చినట్టుగా రాజయ్య వివరించారు. తనను కడియం శ్రీహరి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తారో కూడ కేటీఆర్ కు వివరించినట్టుగా పేర్కొన్నారు.. అయితే పార్టీని బలోపేతం చేసేందుకు పనిచేయాలని కేటీఆర్ సూచించారన్నారు. ఇతర విషయాలన్నీ తమకు వదిలేయాలని కేటీఆర్ సూచించారని రాజయ్య చెప్పారు. . రానున్న రోజుల్లో కడియం శ్రీహరిపై వ్యాఖ్యలు చేయకుండా ముందుకు వెళ్తానని రాజయ్య చెప్పారు.వచ్చే ఎన్నికల్లో స్టేషన్ ఘన్ పూర్ అసెంబ్లీ స్థానం నుండి ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేస్తానని చెప్పారు.                                             

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget