By: ABP Desam | Updated at : 15 Feb 2023 11:22 PM (IST)
ములుగు జిల్లాలో పర్యటించిన 27మంది ఈశాన్య రాష్ట్రాల యువత
యువతతోనే దేశాభివృద్ధి.. జిల్లా ఎస్పీ గాష్ ఆలం
- ములుగు జిల్లాలో పర్యటించిన 27మంది ఈశాన్య రాష్ర్టాల యువత
- రామప్ప సందర్శన, జిల్లా ఎస్పీతో ఇంటరాక్షన్
ములుగు : దేశాభివృద్ధి యువతతోనే సాధ్యమని, ఉన్నత లక్ష్యాలతో సత్ప్రవర్తన కలిగి ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ములుగు జిల్లా ఎస్పీ గాష్ ఆలం సూచించారు. భారత్ అమృత్ మహోత్సవ ఏకాత్మత యాత్రలో భాగంగా ఈశాన్య రాష్ర్టాలకు చెందిన 27మంది విద్యార్థులు బుధవారం ములుగు జిల్లాలో పర్యటించారు. స్టూడెంట్ ఎక్స్ పీరియన్స్ ఇంటర్ స్టేట్ లివింగ్ కార్యక్రమంలో భాగంగా మొదట ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శించిన బృందం సభ్యులు ఆలయ చరిత్ర గురించి గైడ్ విజయ్ ద్వారా తెలుసుకున్నారు.
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం విశిష్టత
అనంతరం ములుగులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ గాష్ ఆలం, ఓఎస్డీ అశోక్ కుమార్ లతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ గాష్ ఆలం మాట్లాడుతూ.. భారతదేశ ఔన్నత్యాన్ని వర్ణించలేమని, భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది ప్రపంచంలో ఒక్క భారతదేశం మాత్రమేనని స్పష్టం చేశారు. విభిన్న సంస్క`తులు, సాంప్రదాయాలను కలిగి ఉన్నా అందరం ఒక్కటేననే భావనతో కలిసిమెలిసి దేశం కోసం జీవించడంలో ఆనందం ఉంటుందన్నారు. భారతీయులందరూ కలిసి ఒక్కటిగా ఉన్నందునే ప్రపంచదేశాలు ఏమీ చేయలేకపోతున్నాయని తెలిపారు. కాగా, 27మంది రాష్ర్టాల ప్రతినిధులు ఎస్పీతో చిట్ చాట్ చేశారు.
సమ్మక్క, సారలమ్మల జ్ఞాపిక అందజేత
తమ విద్యాభ్యాసం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఒక్కొక్కరితో మాట్లాడుతూ వారికి ఎస్పీ గాష్ ఆలం మార్గదర్శనం చేశారు. వీరికి ఎస్పీ మేడారం సమ్మక్క, సారలమ్మల జ్ఞాపికను ఎస్పీ గాష్ ఆలం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ వైసీఎస్ సభ్యులు రవీందర్, ఏబీవీపీ రాష్ర్ట సంఘటనా కార్యదర్శి లవన్, ఉపాధ్యక్షుడు శ్యామ్, వర్కింగ్ కమిటీ సభ్యుడు హర్షవర్ధన్, చిట్యాల రాజు, విభాగ్ కన్వీనర్లు సంతోష్, నిఖిల్, దేవేందర్, మణికంఠ, సీనియర్ నాయకులు గండ్రకోట కుమార్, గాదం దేవేందర్, బద్ధం జనార్ధన్, విష్ణు, మంద మహేష్, చల్లూరి మహేందర్, తదితరులు పాల్గొన్నారు.
విదేశాల్లో మెడిసిన్ పూర్తిచేసిన విద్యార్థులు భారత్‌లో పీజీలో చేరడానికి లేదా ప్రాక్టీసు చేయడానికి.. వారు ముందుగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 'ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ)'లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షను వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. ఆ ధ్రువపత్రం లేకుండా ఎఫ్‌ఎంజీఈకి చేసుకునే దరఖాస్తులను తిరస్కరిచనున్నట్లు ఎన్‌ఎంసీ ప్రకటించింది.
విదేశీ వైద్య విద్యార్థులకు అర్హత ధ్రువపత్రం తప్పనిసరి
ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా అర్హత ధ్రువపత్రం పొందాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థులు నేషనల్ మెడికల్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో మార్చి 8న సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పూర్తిస్థాయి వివరాలు నమోదు చేయని అభ్యర్థుల దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.
Students Bike Stunts : ఇన్ స్టా రీల్స్ కోసం నడిరోడ్డుపై బైక్ స్టంట్స్, అరెస్టు చేసిన పోలీసులు!
TSPSC Paper Leakage: 'గ్రూప్-1' పేపర్ లీకేజీలో ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థుల జాబితా సిద్ధం!
TSPSC Exams: టీఎస్‌పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలు! గ్రూప్-2, 4 పరీక్షలపై సందిగ్ధత!
TSPSC Paper Leak: పేపర్ లీక్, లిక్కర్ కేసులపై నైతిక బాధ్యత వహించి కేసీఆర్ రాజీనామా చేయాలి: మాజీ ఎంపీ
21 నుంచి ఎస్సీటీ ఎస్‌ఐ పరీక్ష హాల్‌టికెట్లు! పరీక్ష ఎప్పుడంటే?
Breaking News Live Telugu Updates: విచారణ ముగిసినా ఈడీ ఆఫీసు నుంచి బయటకు రాని ఎమ్మెల్సీ కవిత
Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!
KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !
Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్