అన్వేషించండి

MLA Seethakka: మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క థ్యాంక్స్! వినతి పత్రం అందజేత

బుధవారం ఉదయం ఎమ్మెల్యే సీతక్క మంత్రి కేటీఆర్ ను కలిశారు. ములుగు కలెక్టరేట్ శంకుస్థాపన దగ్గర మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు

ములుగులో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీకి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. గతంలో తాను చాలాసార్లు అసెంబ్లీ వేదికగా అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. మరికొన్ని విషయాల్లో సీతక్క ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళు, నిధులు, నియామకాల కోసమని.. కానీ ములుగు జిల్లాకు గోదావరి జలాలు రావట్లేదని సీతక్క విమర్శించారు. గోదావరి జలాల కోసం తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వలేదని అన్నారు. మెడికల్ కాలేజీ పనులు ఇంకా ప్రారంభం కాలేదని, మల్లంపల్లి మండల కేంద్రం కూడా చేస్తామని హామీ ఇవ్వలేదని అన్నారు. ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఛత్తీస్‌గఢ్ పూర్తిగా వెనుకబడ్డ రాష్ట్రమని.. అలాంటి రాష్ట్రంతో తెలంగాణను ఎలా పోలుస్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని తెలిసే తమ పార్టీని టార్గెట్ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని అన్నారు. బీఆర్ఎస్ కు రాంరాం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారంటే.. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అర్థం అవుతోందని అన్నారు.

అంతకుముందు బుధవారం ఉదయం ఎమ్మెల్యే సీతక్క మంత్రి కేటీఆర్ ను కలిశారు. ములుగు కలెక్టరేట్ శంకుస్థాపన దగ్గర మంత్రి కేటీఆర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు అందించేలా రామప్ప నుండి లక్నవరం వరకు కెనాల్ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. గోదావరిలో లిఫ్ట్ ఏర్పాటు చేసి చెరువులు నింపాలని కోరారు. మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాలని, గిరిజన యూనివర్సిటీ తరగతులు కూడా వెంటనే ప్రారంభించాలని కోరారు.

పోడు భూములకు పట్టాలు వెంటనే ఇవ్వాలని సీతక్క కేటీఆర్ ను కోరారు. మూతపడ్డ మంగపేట మండలం కమలాపూర్ లో బిల్ట్ ఫ్యాక్టరీని కూడా వెంటనే తెరిపించాలని కోరారు. ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలని కోరారు. మంగపేట కేంద్రంగా ఇంజినీరింగ్ కళాశాల, గోవిందరావుపేట మండలం పసర కేంద్రంగా సమ్మక్క సారలమ్మ నర్సింగ్ కాలేజీ కూడా మంజూరు చేయాలని అన్నారు. మల్లంపల్లి, లక్ష్మీదేవిపేట, రాజుపేటలను మండలాలుగా ప్రకటించాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు.  కేసీఆర్‌ను కలిసే అవకాశం ఉండదని, అందుకే తాను మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రం ఇచ్చానని చెప్పుకొచ్చారు.

ఛత్తీస్ గఢ్‌తో పోల్చిన మంత్రి కేటీఆర్

తెలంగాణలో ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్‌లో మాత్రం నామమాత్రంగా ధాన్యం కొంటున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ తరహాలోనే ఛత్తీస్‌గఢ్‌లో వరి, పత్తి సాగవుతుందని, అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరానికి 12 క్వింటాళ్లే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఎంత ధాన్యం పండించినా ఎకరానికి పరిమితంగానే ధాన్యం కొంటారని అన్నారు. మిగతా ధాన్యమంతా రైతులు మార్కెట్‌కు వెళ్లి మిల్లర్‌ ఎంత ఇస్తే అంతకు అమ్ముకోవాల్సిందేనని అన్నారు. పండించిన ధాన్యానికి ప్రభుత్వ రక్షణ లేదని, ప్రభుత్వ మద్దతు ధర కూడా లేదని అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్‌ డేలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజమెత్తారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet Decisions: హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్‌! 1.5 లక్షల సబ్సిడీ ఇచ్చే నిర్ణయం తీసుకున్న మంత్రి మండలి!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Breaking News:ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
ఏపి సంపర్క్ క్రాంతి ట్రైన్ లో పొగలు- టెన్షన్ పడ్డ ప్రయాణికులు 
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget